Breaking News

08/04/2019

తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్

హైద్రాబాద్, ఏప్రిల్ 8 (way2newstv.in)
అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటామే తప్ప తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని వీడమని చెప్పిన నేతలు కూడా ఆ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా అధికార పార్టీకి క్యూ కట్టారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు కూడా టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు ఎమ్. ఎన్ శ్రీనివాస్ టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. అంతకంటే ముందు నామా నాగేశ్వర్‌రావు పార్టీ మారి ఏకంగా టిఆర్‌ఎస్ నుంచి ఖమ్మం ఎంపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా మిగిలింది నలుగురైదురు నేతలే కావడం గమనార్హం. ఎన్‌టిఆర్ భవన్‌లో శనివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన పం చాంగ శ్రవణం కార్యక్రమం చూస్తే ఈ విషయం స్పష్టమౌతోంది. 


తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్

ఎన్‌టిఆర్ భవన్‌లో ఏ చిన్న కార్యక్రమం చేసినా సీనియర్ నేతలతో పాటు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయేది.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భవన్‌లో  ఉగాది వేడుకల్లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, సీనియర్ నాయకులు ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బండ్రు శోభారాణి, జి.బుచ్చిలింగం మాత్రమే పాల్గొన్నారు. వీరిలో కూడా ఇద్దరితో టిఆర్‌ఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. పెద్ద నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికార పార్టీలోకి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో టిడి పి జెండా మోసేందుకు కూడా కార్యకర్తలు కూడా లేరు.అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో, గొప్పో కొన్ని సీట్లు గెలిచిన కాంగ్రెస్ నుంచే భారీ స్థాయిలో వలసలు పోతున్నారని, అందులో తమ పెద్ద లెక్కలోకి కూడా రాదని ఆ నాయకుడు పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ఉద్యమకాలం నుంచే రాష్ట్రంలో టిడిపి ప్రభావం తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ పతనం మొదలైంది. ఓటుకు నోటు కేసు తదనంతరం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇద్దరైనా గెలిచారనే సంతోషం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.

No comments:

Post a Comment