Breaking News

05/04/2019

మేలో లోకల్ పోల్స్

హైద్రాబాద్, ఏప్రిల్ 5(way2newstv.in)
ఎంపిటిసి, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలన్నింటిని మే చివరి వారంలోపు ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసుకున్న షెఢ్యూల్ ప్రకారం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఆలస్యమైనందున పార్లమెంట్ ఎన్నికల కోడ్‌లోనే ఈ ఎన్నికలు కూడా ముగించాలని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తుం ది. ఇక 136 మున్సిపాలిటీల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘానికి ఎటువంటి స్పష్టత రాలేదు. మున్సిపాలిటీలకు మున్సిపల్ యాక్ట్‌ను పటిష్టం చేసేలా సవరణ చేసిన తరువాతే నిర్వహించాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం మున్సిపల్ ఎన్నికల నిర్ణయం తీసుకోనున్నారు. 


మేలో లోకల్ పోల్స్

రాష్ట్రంలో పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఇప్పటికే ముద్రించారుఈనెల 15వ తేదీ నుంచి 20 వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఏర్పాట్లపై అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన భవనాలు గుర్తించాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎంపి స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయిని, మే 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉండనున్నాయి. ఈ వ్యవధిలోనే ఏప్రిల్ 14 నుంచి మే 20వ తేదీ లోపు పట్ట ణ స్థానిక సంస్థలు, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 32 జడ్‌పిల చైర్‌పర్సన్లు, వాటి పరిధిలోని 538 గ్రా మీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపిపి అధ్యక్ష స్థా నా ల్లో ఎస్‌టి, ఎస్‌సి, బిసి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్‌పిలు, ఎంపిపిల పరిధిలోని జడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాల పునర్విభజన పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి.

No comments:

Post a Comment