Breaking News

04/04/2019

పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న భారత్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4, (way2newstv.in)
ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు భారత్ దెబ్బేంటో తెలుస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్‌ను గ్రే లిస్టులో ఉంచడంతో.. ఆ దేశానికి ఏటా పది 10 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ ఫోర్స్ పాక్‌ను గ్రే లిస్టులో ఉంచింది. దేశీయంగా చట్టాలు బలహీనంగా ఉన్న, మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం తదితర సమస్యలు ఉన్న దేశాలను గ్రే లిస్టులో ఉంచుతారు. 


పాకిస్తాన్ కు  చుక్కలు చూపిస్తున్న భారత్

అంతర్జాతీయ భారత్ ఒత్తిడి పెంచుతుండటంతో.. ఇప్పుడు పాకిస్థాన్ ఏకంగా ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ ముప్పును ఎదుర్కొంటోంది. బ్లాక్ లిస్ట్‌లోకి చేరితే.. వార్షికంగా ఇంకెంత నష్టం వాటిల్లుతోందనే విషయమై పాక్ అంచనాలేస్తోంది. భారత్ లాబీయింగ్ వల్లే తమకు ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది.గ్రే లిస్ట్ నుంచి తమను తొలగించాలని పాకిస్థాన్ కోరుతుండగా.. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ సూచించింది. జైషే మహ్మద్‌ లాంటి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి అధికం అవుతోంది. ఆ దేశంలో ఆర్థిక నేరాల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఎఫ్ఏటీఎఫ్ బృందం మార్చిలో పాకిస్థాన్‌‌లో పర్యటించింది. క్షేత్ర స్థాయిలో పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యల పట్ల ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది

No comments:

Post a Comment