న్యూ ఢిల్లీ ఏప్రిల్ 13 (way2newstv.in)
ఏపీలో ఈవీఎంల వద్ద, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సెక్యూరిటీ పెంచాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం అయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలి. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలి. అన్ని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24 గంటలూ పని చేసే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
స్ట్రాంగ్ రూముల దగ్గర కేంద్ర బలగాలు వుండాలి
ఈసీకీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల ను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా సీఈవోకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ లో వద్ద కాపలాగా ఉంచాలి. రాష్ట్ర పోలీసు మీద వైకాపా కు నమ్మకం లేదని విజయాసాయి రెడ్డి లేఖలో పేర్కోన్నారు.
No comments:
Post a Comment