Breaking News

13/04/2019

తుగ్గలిలో సీతారాముల కళ్యాణ రథోత్సవం

ఉదయం పంచభూతాల సాక్షిగా సీతారాముల కళ్యాణం.
సాయంకాలం ఐదు గంటలకు సీతారాముల రథోత్సవం.
తుగ్గలి, ఏప్రిల్ 13  (way2newstv.in)   
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా నేడు తుగ్గలిలో సీతారాముల కళ్యాణ రథోత్సవం నిర్వహిస్తున్నట్టు గ్రామ పెద్దలు తెలియజేశారు. సీతారాముల కళ్యాణం రథోత్సవ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజున ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు నవగ్రహ పూజ మరియు రుద్రాభిషేకము గ్రామ ప్రజలు నిర్వహించారు.


తుగ్గలిలో సీతారాముల కళ్యాణ రథోత్సవం

శ్రీరామ నవమి పండుగ  సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు కలశ స్థాపన మరియు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు పంచభూతాల సాక్షిగా శ్రీ రాముల దేవాలయం నందు కల్యాణ కట్టపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తున్నట్టు గ్రామ పెద్దలు తెలియజేశారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం an సాయంకాలం 5 గంటలకు సీతారాముల కళ్యాణం రథోత్సవం నిర్వహిస్తున్నట్టు గ్రామ పెద్దలు తెలియజేశారు.సీతారాముల కళ్యాణం రథోత్సవం కార్యక్రమంనకు తుగ్గలి తహసిల్దార్ అనిల్ కుమార్,ఎండిఓ శ్రీనివాసులు,సీఐ భాస్కర్ రెడ్డి,ఎస్ఐ శ్రీనివాసులు,పంచాయతీ సెక్రెటరీ రాజు నాయక్ మరియు విఆర్ఓ నాగేంద్ర తదితరులు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని గ్రామ పెద్దలు తెలియజేశారు. శ్రీరామనవమి పండగ సందర్భంగా నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణం మరియు రథోత్సవం కార్యక్రమంలో భక్తులు పాల్గొని దేవుని ఆశీస్సులు పొంది,కార్యక్రమాలను విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు తెలియజేశారు.

No comments:

Post a Comment