Breaking News

10/04/2019

నిమ్మకాయలకు భారీగా పెరిగిన డిమాండ్

రాజమండ్రి, ఏప్రిల్ 10, (way2newstv.in)
వేసవి నిమ్మ సీజన్ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా చాగల్నాడు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రముఖ హోల్‌సేల్ నిమ్మ మార్కెట్‌గా పేరొందిన రాజమహేంద్రవరం నుంచి దేశ వ్యాప్తంగా నిమ్మ ఎగుమతులు జరుగుతున్నాయి. నిమ్మ మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు అనూహ్యంగా పెరిగాయి. రైతుల వద్ద దిగుబడి పూర్తిగా పడిపోయింది. నిన్న బస్తా రూ.3 వేలు అత్యధిక ధర పలికింది. ఈనెల ప్రారంభం నుంచి శనివారం వరకు రూ.300 నుంచి రూ.1500 మాత్రమే ఉన్న నిమ్మకాయల ధరలు ఆదివారం ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. మార్కెట్‌లో నాణ్యమైన నిమ్మకాయలు మొదటి రకం లూజు బస్తా ధర రూ.2వేలు నుంచి రూ.3వేలు చొప్పున, రెండో రకం నిమ్మకాయలు లూజు బస్తా ధర రూ.1000 నుంచి రూ. 1900 చొప్పున, అదే పండ్లు రూ.1000 నుంచి రూ.1500 చొప్పున అమ్మకాలు రైతుల వద్ద నుంచి వ్యాపారులు పోటాపోటీగా కొనుగోళ్లు సాగాయి. ప్రస్తుతం నిమ్మకాయలను వ్యాపారులు ఆర్డర్లపై ఎగుమతి చేస్తున్నారు. బిహార్‌, ఝార్ఖండ్‌, రాంచీ, బొకారో, పట్నా తదితర ప్రాంతాలకు వ్యాపారులు, కొనుగోళ్లదారులు నిమ్మకాయలను పంపుతున్నారు. 


 నిమ్మకాయలకు భారీగా పెరిగిన డిమాండ్

ధరలు బాగా ఉన్నా మార్కెట్‌కు కాయలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. దీంతోనే ధరలకు రెక్కలు వచ్చాయి.నిమ్మసాగు చేస్తున్న ప్రాంతాలలో ఐదు నెలలుగా వర్షాలు లేకపోవడంతో మెట్ట ప్రాంతంలోని నిమ్మ చెట్లు ఎండుముఖం పట్టాయి. సాగునీరు, సరిపడా లేకపోవడంతో చెట్లకు ఉన్న కాయలు, పిందెలు, రాలిపోతున్నాయి. దీంతో దిగుబడి అనూహ్యంగా పడిపోయింది. ప్రస్తుతం దుకాణాలకు 10 నుంచి 30 బస్తాలులోపు మాత్రమే రైతులు తీసుకొని వస్తున్నారు.రైతులు ఈ సీజన్‌లో నాణ్యమైన నిమ్మ దిగుబడులు సాధించారు. అన్ సీజన్‌లో అయితే రోజుకు 32 నుంచి 35 టన్నుల వరకు నిమ్మ ఎగుమతులు జరిగేవి. వేసవి సీజన్ ఆరంభంతో ప్రస్తుతం రోజుకు 95 నుంచి 99 టన్ను ల వరకు నిమ్మ ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక ఎకరం పొలం నుంచి రోజుకు ఒక బస్తా అంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల నిమ్మకాయల దిగుబడి వస్తుంటుంది. ఈ నిమ్మ కాయలను పెద్ద పెద్ద బస్తాల్లో రైతులు హోల్‌సేల్ కమిషన్ యార్డుకు తీసుకొస్తారు. అక్కడ కమిషన్ వ్యాపారులు వెయ్యి నిమ్మకాయల చొప్పున గోనె సంచుల్లో గడ్డి వేసి ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. రాజమహేంద్రవరం నిమ్మ మార్కెట్ యార్డు నుంచి ప్రధానంగా పశ్చిమ బెంగాల్, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు.ప్రస్తుతం వెయ్యి కాయల ధర హోల్‌సేల్‌గా రూ.2500 వరకు పలుకుతోంది. డిమాండ్ పెరిగే కొద్దీ మరి కాస్త ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్‌లో నిమ్మ ధరలు ఎలా పెరిగినప్పటికీ రైతులకు మాత్రం ఆ లాభాలు దక్కే అవకాశం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ, గోకవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, రంగంపేట, సీతానగరం, కడియం, బిక్కవోలు, అనపర్తి, పెద్దాపురం, గండేపల్లి, కత్తిపూడి తదితర మండలాల్లో నిమ్మ ప్రధానంగా సాగవుతోంది. ఇందులో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో విస్తారంగా సాగు జరుగుతోంది. ఎగుమతికి చాగల్నాడు నిమ్మకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాగల్నాడు ప్రాంతం లో 10వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిమ్మ తోటలు విస్తరించివున్నాయి

No comments:

Post a Comment