Breaking News

15/04/2019

సిటీలోకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు

హైద్రాబాద్, ఏప్రిల్ 15, (way2newstv.in)
హైద్రాబాద్ నగర రోడ్లపై మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగనున్నాయి. 100 బస్సుల్లో ఇప్పటికే 40 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ అధికారులు మిగతా వాటిని మే మొదటివారంలో మిగతా బస్సులను తిప్పనున్నారు.ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే ఈ బస్సులవల్ల వాయు, శబ్ధ కాలుష్యం లేకుండా గప్‌చుప్‌గా నడుస్తున్నాయి. ఈ బస్సులను ఒలెక్ట్రా బిడ్ సంస్థ మన దేశంలోనే తయారుచేశారు. ఒక్కో బస్సుకు కేంద్ర ప్రభుత్వం రూ. కోటి సబ్సిడీ అందిస్తున్నది. వాయు, శబ్ధ కాలుష్యం లేకపోవడం ఈ బస్సులకుగల ప్రధాన ప్రత్యేకత. ఒకసారి చార్జి చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. లిథియం ఇయాన్ బ్యాటరీతో చార్జింగ్ చేసే బ్యాటరీని 4 నుంచి 5 గంటలు చార్జి చేస్తే పూర్తిగా చార్జి అవుతుంది. 12 మీటర్ల పొడవుతో ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సహా 40 మంది ప్రయాణించవచ్చు. 


సిటీలోకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు

సీనియర్ సిటీజన్స్ ఎక్కిదిగేందుకు వీలుగా, ఇందులో ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ కలిగి ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ ఏయిర్ సస్పెన్షన్ ఫర్ కంఫర్టబుల్ రైడ్ దీని సొంతం. ఆన్‌బోర్డు మ్యాప్స్ అండ్ నావిగేషన్, వైఫై కనెక్టివిటీ అండ్ రేడియో సిస్టం, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం, ఎల్‌ఈడీ లైటింగ్ తదితర సదుపాయాలున్నాయి.మొదటిదశలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు జేబీఎస్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి ఏయిర్‌పోర్టుకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ బస్సుల సేవలు రేషియో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే ఓఆర్ నమోదు అవుతుండటంతో వీటిని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ప్రజారవాణాకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నది. కంటోన్మెంట్, మియాపూర్ డిపోల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 20 చొప్పున సర్వీసులు నడుపుతున్నారు. ఇదే తరహాలో మరో 60 బస్సులను తెచ్చి నగరంలోని ప్రధాన రూట్లలో తిప్పనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో దీని ప్రభావం నగర టీఎస్‌ఆర్టీసీపై తీవ్రంగా పడటంతో కొత్తగా తీసుకురానున్న బస్సులను రద్దీ మార్గాల్లో తిప్పాలనే ఆలోచనతో ఉన్నతాధికారులు మార్గాన్ని సర్వే చేస్తున్నారు.

No comments:

Post a Comment