Breaking News

19/03/2019

మళ్లీ వేగం పెంచుకున్న డబుల్ ఇళ్లు

హైద్రాబాద్, మార్చి 19, (way2newstv.in)
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పనులను గృహ నిర్మాణ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం 20 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, తుది దశలో 30 వేల నిర్మాణాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు 80 వేల ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షం నిర్ధేశించుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మేర నెమ్మదించినా ప్రస్తుతం మూడు నెలలుగా ఇళ్ల నిర్మాణాలు చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లాల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లిలో 7,200, నల్లగొండ 7,165, సిద్దిపేట 12,200, వరంగల్ 3,764, మేడ్చల్ 2,340, మంచిర్యాల 4,450, రంగారెడ్డి 6,645, కొత్తగూడెం 6,438, కొత్తగూడెం 6,438, ఆదిలాబాద్ 4,049, నిర్మల్ 6,273, కామారెడ్డి 7,008, వికారాబాద్ 5,740, భూపాలపల్లి 5,749, సంగారెడ్డి 5,554, మెదక్ 5,479, ఆసిఫాబాద్ 2,550, ఖమ్మం 14,490, కరీంనగర్ 6,610, వనపర్తి 2,400, జనగామ 81,763, సూర్యాపేట 2,000, నిజామాబాద్ 7,327, మహబూబ్‌నగర్ 3,700, జగిత్యాల 7,200, యాదాద్రి 2,448, సిరిసిల్ల 4,000, మహబూబాబాద్ 4,258, వరంగల్ 25,319, హైదరాబాద్ 98,000. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 



మళ్లీ వేగం పెంచుకున్న డబుల్ ఇళ్లు

2018 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 4 వేలను ఇళ్లను మాత్రమే పూర్తి చేసిన గృహ నిర్మాణ శాఖ 2019 జనవరిలో 1,500 వందలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో తుదిదశకు వచ్చిన ఇళ్ల నిర్మాణాలు సుమారు 30 వరకు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా విద్యుత్, డ్రైనేజీ రోడ్ల కనెక్టివీటి దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఒకవైపు ఇళ్లను వేగంగా పూర్తి చేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలోనూ అధికారులు అదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఆయా శాఖలతో ఇప్పటికే అధికారులు పలుమార్లు సమావేశాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు సముదాయాల వద్ద ఇప్పటికే రోడ్లు, విద్యుత్ కనెక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి.. 2018, డిసెంబర్‌లో మరోసారి టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పేదలకు వాటిపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక హైదరాబాద్ పరిధిలో సుమారు 3 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. మిగిలిన జిల్లాల్లో దాదాపుగా మరో 6 నుంచి 7 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ జిల్లాల్లో 78 వేల ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం 2,60, 927 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, ప్రభు త్వం 2,37,756 ఇళ్లకు టెండర్లను పిలిచింది. అందులో 1,98,929 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1,77, 654 ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన వాటికి రీ టెండర్లు పిలిచి నిర్మాణాలను ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ భావిస్తోంది. సిద్దిపేటలో 4,600లకు పైగా ఇళ్లు, ఖమ్మంలో 2,200లకు పైగా, భద్రాద్రి కొత్తగూడెం 1,400లకు పైగా, రాజన్న సిరిసిల్ల సుమారు 2 వేలు, సూర్యాపేట 800ల ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.అన్ని జిల్లాల్లో దరఖాస్తుల దారుల సంఖ్య భారీగా ఉండడంతో ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment