Breaking News

30/03/2019

సింహం సింగిల్‌గానే వస్తుంది: జగన్ సోదరి షర్మిల

గుంటూరు మార్చ్ 30 (way2newstv.in):
రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు.డ్వాక్రా మహిళలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. ఇప్పడు పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారని దుయ్యబట్టారు. శనివారం గుంటూరు సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం అంచనాలు పెంచారు. 


సింహం సింగిల్‌గానే వస్తుంది: జగన్ సోదరి షర్మిల

అమరావతిలో వేల ఎకరాలను తన బినామీలకు కేటాయించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఆ జాబు లోకేష్‌కు వచ్చింది. లోకేష్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలీదు. పప్పుగారు ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా మూడు శాఖలకు మంత్రి అయ్యారు. ఏ అర్హత ఉందని లోకేష్‌ను జనాల నెత్తిన రుద్దారు అని మండిప‌డ్డారు.చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 650 హామీలు ఏమయ్యాయి. నిన్ను నమ్మం బాబు అని పచ్చపార్టీకి తేల్చి చెప్పండి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పొత్తులు అవసరం లేదు.. సింహం సింగిల్‌గానే వస్తుంది. బైబై బాబు.. ఇదే ప్రజా తీర్పు కావాల‌ని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment