Breaking News

23/03/2019

పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతుల దర్నా

గంగాధర, మార్చి 23,(way2newstv.in)
ఇటీవల కురిసిన అకాల వడగండ్ల  వర్షానికి నష్ట పోయిన పంటలకు అధికారులు వెంటనే స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రం లోని ప్రధాన రహదారి లో  వెంకం పల్లె, పోతుగంటి పల్లె రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శనివారం దర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ దర్నా రాస్తారోకోలతో  ఎక్కడికక్కడ వాహనాలు అర గంట పాటు నిలిచి పోయాయి. రోడ్డు పై బైఠాయించిన రైతులలో పోతుగంటి పల్లె కు చెందిన కడారి మల్లా రెడ్డి అనే రైతు క్రిమి సంహారక మందు డబ్బా పట్టు కొని ఆత్మహత్య యత్నం చేసుకునే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి రైతు దగ్గర నుండి మందు డబ్బా ను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ సంతోష్ కుమార్ రైతులతో సముదాయిస్తూ ప్రతి విషయానికి రోడ్డు పై దర్నాలు చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం  సరియైనది కాదని అన్నారు.  


పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతుల దర్నా

ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి కలవాలని పట్టించుకోక పోతే ఆయా సంబంధిత కార్యాలయాల  వద్ద దర్నాలు చేయాలని చెప్పినప్పటికి రైతులు వినిపించుకోకుండా వ్యవసాయ అధికారులు ఇక్కడకు వచ్చి పంట నష్టం ఇస్తామని హామినివ్వాలని డిమాండ్ చేసారు. చివరికి నేనే స్వయంగా అధికారుల వద్దకు తీసుకొని వెల్లుతానని ఎస్ ఐ అనడంతో దర్నా విరమించి వ్యవసాయ కార్యాలయం వద్దకు వెల్లారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో పంటలు సాగు చేసుకొని ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరి పంట, మొక్క జొన్న పంట, మామిడి తోటలు పూర్తిగా దెబ్బ తిని తీవ్ర నష్టం వాటిల్లిందని ఇంతవరకు వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతి నిధులు పట్టించుకున్న పాపాన పోలేదని మాకు ఆత్మహత్య శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ దర్నా కార్యక్రమంలో గంగాధర ఎంపిటీసి బీజేపి జిల్లా ఉపాధ్యక్షుడు పెరుక శ్రావన్ కుమార్ పలువురు రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

No comments:

Post a Comment