Breaking News

23/03/2019

పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు

కర్నూలు, మార్చి 23 (way2newstv.in)
పార్లమెంట్,  అసెంబ్లి  స్ధానాలకు పోటీ చేసిన అభ్యర్ధుల అఫిడవిట్ లను ఈ నెల 25 వ తేదీలోగా  అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం  జిల్లా కేంద్రం నుండి ఎన్నికల  పటిష్ట నిర్వహణ పై ఆర్.ఓ సంబంధిత పోలింగ్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు అఫిడవిట్ లను ఈ నెల 25 లోగా అప్ లోడ్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధిత పోలింగ్ సామాగ్రి చేరవేసే డిస్టిఋబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఎక్కువ సమయం నిలబడకుండా కనీసం 50 మంది కూర్చునేలా షామియనా, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను ఓటర్ల కు పంపీణీ చేయాలన్నారు.


పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు

వికలాంగ ఓటర్లు ఓటు వేసేందుకు సహాయకులను అన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకున్నామని  ఇంకా ఏమైనా మిగిలి వుంటే పూర్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ విధుల్లో వున్న  సిబ్బందికి పోస్టల్ బ్యాలెటుకు సంబంధించిన ఫారం 12, వ ధరఖస్తులను అందరికి  ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్ని కలెక్టర్ ఆదేశించారు. వీడియో సర్వేలైను స్టాటికల్ సర్వే టిములు అత్యంత చురుకుగా పనిచేసేలా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రిజర్వులో వున్న ఇవియంలను సెక్టోరల్ అధికారుల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వనరబుల్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తనీఖి చేసి చేపట్టాల్సిన అంశాల పై చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఓటును నమెదు చేసుకున్న ఫారం-6 ధరఖస్తులు శ్రీశైలం, ఎమ్మిగనూరు నియెజకవర్గాల్లో వంద శాతం పూర్తి అయ్యాయని,  ఆత్మకూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పెండింగుల్లో వున్నాయని త్వరితగతిన పూర్తి కలెక్టర్ తాహసిల్ధార్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో నగరపాలక సంస్ధ కమీషనర్ , రిటర్నింగ్ అధికారి ప్రశాంతి,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment