Breaking News

19/03/2019

వినూత్న ప్రచారంలో గులాబీ దళం

కరీంనగర్, మార్చి 19, (way2newstv.in)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం విజయవంతం కావడంతో సిరిసిల్ల ప్రాంత టిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఇనుమడించింది. సిరిసిల్ల ప్రాంతంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేపడుతున్న అభివృధ్ధి పనుల ప్రభావం అధికంగా ఉంది.సిరిసిల్లలో విలీనం అయిన సర్దాపూర్ గ్రామ సమీపంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించే సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారిని అనుకుని పార్టీ ఎన్నికల గుర్తు కారును నిలిపారు. అసలైన కారుకు గద్దె కట్టి గులాబి రంగువేసి ప్రచారం కోసం నిలబెట్టి వేలాది మందిని ఆకర్షించేలా చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంనుండి ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కామారెడ్డివైపు వెళ్లేవారికి అదే విధంగా కామారెడ్డి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట నుండి సిరిసిల్లకు, వేములవాడకు, కరీంనగర్‌కు, జగిత్యాలకు వెళ్లేవారికి కారు గుర్తు కనిపించేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కారుగుర్తుకు ఓటేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిఎం కెసిఆర్ కరీంనగర్ సభకు తరలిరావాలని ఓటర్లను కోరడానికి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి కారుగుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు.



వినూత్న ప్రచారంలో గులాబీ దళం

 ఒకే ఓటరును పలుమార్లు కలుస్తూ తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతుండటంతో తప్పని సరి పరిస్థితుల్లో ఓటర్లు కారుకు ఓటేస్తున్నారు. ఇప్పటికే సారూ … కారు… పదహారు…. సర్కారు అనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకుని పోయి ప్రతివారి నోట ఊత పదంలా సారూ కారూ పదహారు సర్కారు అంటున్నారు. ఎన్నికల నినాదం ప్రజలకు ఊత పదంగా మారడంతో తెరాసకు ప్రచారంలో ఎంతో కలిసి వస్తోందని చెప్పవచ్చు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్‌పిటిసి స్థానాలు, ఎంపిపి, జడ్‌పి చైర్‌పర్సన్ స్థానాలు ఆశించేవారు ఇప్పటినుండే సర్పంచులను ఆకట్టుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పరిధిలో కారుకు అత్యధికంగా ఓట్లు పోల్ చేయించి తమ సత్తాను నిరూపించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు సంపాదించుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్‌నే తిరిగి బరిలోకి దించడం కలిసివచ్చిన అదృష్టమనే చెప్పుకోకతప్పదు.

No comments:

Post a Comment