Breaking News

21/03/2019

గుడివాడలో భీక‌ర బ్యాలెట్ పోరు

విజయవాడ, మార్చి 21 (way2newstv.in)
గుడివాడ రాజ‌కీయం రంజుగా మారింది. ఇద్ద‌రు కొద‌మ సింహ‌ల్లాంటి నేత‌ల మ‌ధ్య ఈ సారి భీక‌ర బ్యాలెట్ పోరు సాగ‌నుంది. పేరు మోసిన నేత ఒక‌రైతే…పేరు మోసిన నేత త‌న‌యుడిగా..ఆయ‌న ఆశ‌యాల‌కు వార‌సుడిగా ఎన్నిక‌ల స‌మ‌రాంగంలోకి దూకుతున్న యువ‌నేత మ‌రొక‌రు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త నేత ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కొడాలి నాని రెండు సార్లు ఆ పార్టీ గుర్తుపై గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో త‌లెత్తిన వివాదాల కార‌ణంగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా మారారు. చంద్ర‌బాబును ఎత్తిపోడ‌వ‌డంలో ఆయ‌న‌పై, లోకేష్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ టీడీపీకి కొర‌క‌రాని కొయ్యాల మారారు. ఇక నాని పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ప‌రిస్థితి టీడీపీ అధినేత చంద్ర‌బాబులో క‌నిపిస్తున్న‌ట్లు స‌మాచారం. వైసీపీలో అత్యంత ప్ర‌భావ‌శీలుర నాయ‌కుల్లో ఆయ‌నొక‌డుగా నిలిచారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా నాని ఓడించాల‌ని మొద‌ట్నుంచి టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అందుకే నానిని గుడివాడ‌లో ఎదుర్కొవాలంటే పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కులు ఒక్క‌టిగా ప‌నిచేసేలా చ‌ర్య‌ల‌ను ఆరంభించింది. 


గుడివాడలో భీక‌ర బ్యాలెట్ పోరు

నానిని ఓడించ‌డం అంటే అంత ఈజీ కాద‌న్న విష‌యం టీడీపీ అధినేత చాలా బాగా తెలుసు. ఆర్థికంగానూ బ‌ల‌మైన నేత కావాల‌ని యోచించారు. గుడివాడ టికెట్ ఆశిస్తున్న ప‌లువురి పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చినా వారు స‌రిపోర‌ని భావించిన చంద్ర‌బాబు దివంగ‌త నేత దేవినేని నెహ్రూను ఇక్క‌డి నుంచి పోటీ చేయిస్తే బాగుటుంద‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అవినాష్ లోకేష్‌కు అత్యంత స‌న్నిహితుడు. లోకేష్ టీంలో ఆయ‌న కూడా ఒక‌రు. ఇక్క‌డ అవినాష్‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనైనా ఈ సారి గెలిపించాల‌ని లోకేష్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే అవినాష్ స్థానిక నేత‌ల‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్తూ..త‌న‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని అభ్య‌ర్థిస్తూ వ‌స్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా నాయ‌కులంద‌రిని క‌లుపుకుపోతూ ముందుకు సాగుతున్నార‌ట‌. కొడాలి నాని ఇక్క‌డి నుంచి మూడు సార్లు వ‌రుస‌గా గెలిచారు. ఆయ‌న గెల‌వనైతే గెలిచారు గాని ప్ర‌తిప‌క్షంలోనే ఉంటుడ‌టం జ‌రిగింది. గ‌డిచిన ద‌శాబ్ధ‌కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న‌ది రాజకీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. అయితే నాని మాత్రం సొంత డ‌బ్బుల‌తో సేవా కార్య‌క్ర‌మాలు, తాగునీటి వ‌స‌తి వంటివి గ్రామాల్లో చేప‌డుతున్నారు. ఇవే ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో స‌దాభిప్రాయం క‌లిగిస్తున్నాయ‌న్న వాద‌న ఉంది.నానికి గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద‌గా మెజార్టీ రాక‌పోవ‌డాన్ని బ‌ట్టి ఈ సారి ఆయ‌న ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న టీడీపీలో వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా నానికి మంచి ఇమేజ్ ఉంద‌నే చెప్పాలి. పెద్ద ఎత్తున ఆయ‌న అనుచ‌రులు ఉండ‌టం ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అంశం. ఆప‌ద‌లో నేనున్నానంటూ ఆదుకునే త‌త్వమే ఆయ‌న‌కు ఫాలోయింగ్‌ను తెచ్చిపెడుతోంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు అవినాష్ కూడా క‌ద‌నోత్సాహంతో క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే యువ‌త‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డాడు. నానికి ధీటుగా క‌నిపిస్తున్నాడు. పైపెచ్చు అధికార పార్టీ అండ‌దండ‌లు దండిగా ఉండ‌టం..నానిని ఓడించాల‌నే క‌సి చంద్ర‌బాబు కుటుంబ‌స‌భ్యుల‌కు గ‌ట్టిగా ఉండ‌టంతో గెలుపుభారం కూడా అవినాష్ కంటే కూడా అధినేత‌పైనే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక జ‌న‌సేన, బీజేపీలు కూడా ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంద‌. ఇప్ప‌టి వ‌ర‌కైతే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌లేదు. ఆ పార్టీల ప్ర‌భావం ఇక్క‌డ పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది వాస్త‌వ‌మే. వైసీపీ-టీడీపీల మ‌ధ్యే ప్ర‌ధాన పోరు జ‌ర‌గ‌నుంది.

No comments:

Post a Comment