Breaking News

11/03/2019

తెలంగాణ టీడీపీకి స్కూల్ మూసేసినట్టేనా

హైద్రాబాద్, మార్చి 11, (way2newstv.in
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరు చూస్తే తెలంగాణ లో టిటిడిపి దుకాణం పూర్తిగా బంద్ చేసేందుకే నిర్ణయించుకున్నారేమో అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటి టి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టిటిడిపి ని పునర్ నిర్మాణానికి బాబు కృషి చేస్తారని అంతా భావించారు. అయితే ఎపి అసెంబ్లీకి ఎన్నికలు తరముకు రావడంతో తన దృష్టి మొత్తాన్ని తిరిగి అధికారంలోకి రావడంపైనే పెట్టారు చంద్రబాబు. అంతే కాదు టిటిడిపి యాక్టివిటీని సైతం ఆయన పర్యవేక్షించే తీరిక సైతం లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల ఫలితాల ప్రభావంతో టిడిపి నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం తెలంగాణాలో అభ్యర్థులు దొరకని పరిస్థితి తలెత్తింది.తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత అనుసరించిన ఫార్ములాను పక్కాగా బాబు ఎపి లో అమలు చేయడం మొదలు పెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ ను జనంలోకి బాగా తీసుకువెళ్లడంతో గులాబీ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంది. 


తెలంగాణ టీడీపీకి స్కూల్ మూసేసినట్టేనా

అమరావతి కేంద్రంగా రాజకీయాలు మనకు అవసరమా ? అంటూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకుపోయారు గులాబీ బాస్. అదే నినాదంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసిపి కెసిఆర్ కి తాకట్టు పెట్టిందంటూ ప్రజల్లోకి వెళుతున్నారు బాబు. టిడిపి ప్రధాన ప్రత్యర్థి వైసిపి కానే కాదని కెసిఆర్ వెర్సెస్ చంద్రబాబు అన్న వార్ మొదలైంది అన్న అంశం ప్రజల్లోకి చొప్పిస్తున్నారు మైండ్ గేమ్ మాస్టర్. తన ప్రత్యర్థి కెసిఆర్ మాత్రమే అంటూ ఎపి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారు అందుకోసం తెలంగాణాలో టి టిడిపి ని పూర్తిగా విడిచిపెట్టేందుకు సైతం ఆయన సిద్ధ పడుతున్నారు.వాస్తవానికి తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్ ఆంధ్రాలో లేకపోవడం టిడిపి కి మైనస్ కానుంది అంటున్నారు విశ్లేషకులు. దానికి తోడు హరికృష్ణ మృతదేహం ఉండగా గులాబీ పార్టీతో చేతులు కలిపేందుకు బాబు స్నేహ హస్తం చాచడం పెద్ద మైనస్ గా మారింది. పలు కార్యక్రమాలకు సైతం ఏపీలో కెసిఆర్ కు బాబు పెద్ద పీట వేయడం కూడా జనంలో చర్చకు దారితీసింది. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు వైసిపి తో కెసిఆర్ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాక గులాబీ పార్టీపై రాజకీయాలు చేయడాన్ని టిడిపి ప్రత్యర్ధులు విమర్శలు ఆరోపణల దాడి పెంచడంతో ఇవి పెద్దగా పసలేనివిగామారిపోయాయి. బాబు కలిస్తే పవిత్రం జగన్ కలిస్తే అపవిత్రం ఎలా అవుతుంది అన్న లెక్కల్లోనే జనం చర్చింకోవడం ముఖ్యంగా సోషల్ మీడియా లో వైసిపి నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీనుంచి నేరుగా జవాబులు లేకపోవడంతో సెంటిమెంట్ అంశం తో పూర్తిగా పని జరగదని తేలిపోయింది.

No comments:

Post a Comment