Breaking News

20/03/2019

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీకి అంతా సిద్ధం

పాలమూరు,మార్చి 20, (way2newstv.in)
పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోరు ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోజోరందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎవరి యత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు, ప్రధాన పార్టీల మద్ధతుతో బరిలోకి దిగిన వారంతా సొంత ఏజెండా, వ్యక్తిగత మేనిఫెస్టోలు ప్రకటిస్తూ గెలుపుకోసం తండ్లాడుతున్నారు. రెండు వేర్వేరు స్థానాలకు జరుగుతున్న పోటీలో ఉపాధ్యాయ స్థానంపై అంతగా దృష్టి సారించలేకపోతుండగా, పట్ట్భద్రుల స్థానం మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు ప్రధాన జాతీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు, అధికార తెరాస మద్ధతుతోపోటీలో నిలిచిన మరో అభ్యర్థి, యువతెలంగాణ అభ్యర్థుల మద్యే ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు పక్కా ప్రణాళికతో పట్ట్భద్రుల ఓట్లు పొందేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. గత పక్షం రోజులుగా తీవ్రమైన ప్రచారంలో బీజేపి అభ్యర్థి ఒకడుగు ముందు వరుసలో ఉండగా, ఇప్పటికే ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో80శాతానికి పైగా ఓటర్లను కలిసినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలింగ్ బూత్‌ల వారీగా 300లకు పైగా మండలాల్లో సమావేశాలు నిర్వహించినట్లు ఆ పార్టీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు, అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని క్షేత్రస్థాయిలో సైతం పేరు సంపాదించారు. ఈధీమాతోనే ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమంటూ తేల్చి చెబుతున్నారు. 


 గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీకి అంతా సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలతో ఏకపక్ష పాలన కొనసాగుతున్న తరుణంలో, ప్రశ్నించే గొంతుకగా మారేందుకు మండలి బరిలోకి దిగినట్లు వెల్లడిస్తున్న కాంత్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కూడా గెలుపుపై భరోసాతో ప్రచారం సాగిస్తున్నారు. ఎదుటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ, గెలిస్తే తాను చేయబోయే పనులపై కర,గోడ ప్రతుల ద్వారా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై తన వ్యాఖ్యానాలతో, తన పంచ్ డైలాగులతో ఉద్యమ ద్రోహులను ఆటాడుకున్న మహిళా జర్నలిస్టుగోగినేని రాణి రుద్రమదేవి గెలుపే ధ్యేయంగా వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. నిత్యం రెండు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్ట్భద్రులను కలుస్తూ, తన ఏజెండా వివరిస్తూ మద్ధతు కూడగడుతున్నారు. ముఖ్యంగా యువజనులు, నిరుద్యోగుల మద్ధతు రోజురోజుకు పెరుగుతుంది. తెరాస మద్ధతుతోతన ఉద్యోగానికి రాజీనామా చేసి, మండలి పోరులో నిలిచిన ఎం.చంద్రశేఖర్ గౌడ్ గెలుపు నాదేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. సీ ఎం కేసీ ఆర్ అండదండలతో పెద్దల సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా, తన గెలుపుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, స్థానిక ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికితోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలుపుకు బోనస్‌గా మారబోతున్నాయని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన దృష్ట్యా నా విజయం నల్లేరుపై నడకలా ముందుకు సాగుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఈనేపథ్యంలో మండలి పోరులోకరీంనగర్ పట్ట్భద్రుల స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

No comments:

Post a Comment