Breaking News

04/03/2019

పునరావాసుల పడిగాపులు

ఏలూరు, మార్చి 4, (way2newstv.in)
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గోడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వినతి పత్రాలు పట్టుకుని పునరావాస అధికారుల కార్యాలయాలకు వచ్చి సంబంధిత అధికారులను కలవాలంటే ఒక రోజు మకాం ఉండాల్సిందే. నిరక్షరాస్యులైన ఆదివాసీలు తమ వినతి పత్రం పట్టుకుని కార్యాలయానికి వస్తే అక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణరాజపురంలో అర్జీలు దొంతర్లు పేరుకుపోతున్నాయి. కుకునూరు, వేలేరుపాడుకు సంబంధించిన నిర్వాసితులు పునరావాస పునర్నిర్మాణ అధికారిగా ఉన్న కన్నాపురంలో ఐటీడీఏ పీవో కార్యాలయానికి రావాల్సిందే. ఇక్కడ అధికారి అందుబాటులో ఉన్నా, ఉండక పోయినా సాయంత్రానికి తిరిగి వెళ్లలేని స్థితి. గిరిజనులు అక్కడే దిక్కులేకుండా పడిగాపులు పడుతున్నారు. ఒక రోజు వచ్చి సాయంత్రానికి తిరిగి ఇంటికి వెళ్లలేని స్థితి. దూర ప్రాంతాల నుంచి వచ్చే నిర్వాసితులు కన్నాపురంలో అధికారులను కలిసేందుకు వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్లలేక ఆ రాత్రికి అక్కడే బస ఉండాల్సిన దుస్థితి. కనీసం అక్కడ భోజనం కొనుక్కుందామంటే కూడా హోటళ్లు కూడా ఉండవు. సాయంత్రానికి తిరిగి ఇళ్లకు చేరుకుందామంటే బస్సులు ఉండవు. 


 పునరావాసుల పడిగాపులు

గత్యంతరం లేక పీవోలు కలవాలంటే రెండు రోజుల పాటు కూలీ పనులు మానేసుకుని కలుసుకోవాల్సిందే. అయినప్పటికీ సంబంధిత పునరావాస అధికారిని కలుసుకునే వీలుంటుందా అంటే అది కూడా గ్యారంటీ లేని పరిస్థితి. కొత్త చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ఇంకా పూర్తి కాలేదు. కుకునూరు, వేలేరుపాడుతోపాటు దేవీపట్నం, చింతూరు, విఆర్ పురం, కూనవరం తదితర ప్రాంతాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే జరుగుతోందని తెలుస్తోంది. వాస్తవానికి లెక్కల్లో మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పునరావాసం పూర్తయినట్టు చూపిస్తున్నారు. కానీ ఇంకా తమకు ఎటువంటి పరిహారం అందలేదని నిర్వాసితులు నేటికీ పీవో కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోడ్లు భవనాల శాఖ నష్టం అంచనా లేదు. కుకునూరు ఆవతల బూర్గంపాడు తదితర ప్రాంతాల నుంచి కెఆర్ పురం రావాలంటే సుమారు 110 కిలో మీటర్లు నుంచి రావాల్సి ఉంది. నిరస్యరాస్యులు కాబట్టి అర్జీ రాయాలంటే అక్కడ రూ. కుకునూరు మండల కేంద్రంలో పునరావాస అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఇద్దరు ఒక జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉంటారు. నిర్వాసితుల సమస్యలన్నీ ఇక్కడ నుంచే పరిష్కరించాల్సి ఉంది. వాస్తవానికి నిర్వాసితులకు కేంద్రంగా అందుబాటులో ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత వరకు ఆర్ అండ్ అర్ ప్యాకేజీ జాబితా కూడా ప్రకటించలేదు. నిర్వాసితులు ఒక చోట, అధికారి ఒక చోటా అన్నట్టుగా ఉంది. గత పీవో తుది జాబితా ప్రకటిస్తానని చెప్పిన దరిమిలా ఆయన బదిలీ కావడంతో నేటికీ తుది జాబితా లేదు. నష్టం అంచనాలు వేయడం ఆర్ అండ్ బి అధికారుల నుంచి భవనాల పరిహారం అంచనా వేయాల్సి వుంది. ఇవి సక్రమంగా జరగలేదు. ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా అంచనాలు కట్టారు. అర్జీలకు పరిష్కారం ఉండదు. ఒక్కో నిర్వాసితుడు కనీసం పదిహేనుసార్లయినా వినతి పత్రం సమర్పించి ఉంటారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఉండే అధికారి కోసం పడిగాపులు పడాల్సిందే. కుకునూరు నుంచి ఏడెనిమిది మంది ఆటో వేసుకుని నిర్వాసితులు వస్తే పడిగాపులు పడాల్సిందే. పీవో హరీంద్రప్రసాద్ పట్టించుకోవాల్సి ఉందని, పాలన స్తంభించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్వే వివరాలు, నష్టం అంచనాలు సక్రమంగా జరగలేదని పలు సమస్యలతో వివిధ అర్జీల దొంతర్లు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాలు నిర్వాసితుల మండలాలుగా వున్నాయి. కొత్త ఆర్ అండ్ ఆర్ యాక్టులో కుటుంబం నిర్వచనం మారింది. గతంలో అయితే భార్యా, భర్త, పెళ్లికాని పిల్లలను ఒక కుటుంబంగా భావించేవారు. కొత్త చట్టం ప్రకారం ఇళ్లు లేకపోయినా ఊర్లో ఉన్న భూమి కోల్పోయినట్టయితే బాధిత కుటుంబంగానే గుర్తించాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫేజ్-1లో ఎనిమిది ఆదివాసీ గ్రామాలు ముంపు గ్రామాలుగా ఉన్నాయి. రెండో ఫేజ్‌లో 22 ఆవాసిత ప్రాంతాలు, వెరసి 30 ఆవాసిత ప్రాంతాలు ఉన్నాయి. మొత్తంగా పరిశీలిస్తే విలీన మండలాల్లో మొత్తం 107 ఆవాసిత ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పోలవరం మండలంలో 4403 కుటుంబాలు, విలీన మండలాల్లో 16520 కుటుంబాలు నష్టపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముంపు గ్రామాలను నాలుగు ఫేజ్‌లుగా విభజించారు. ఫేజ్-1లో ఏడు, ఫేజ్-2లో 25, ఫేజ్-3లో 10, ఫేజ్-4లో 2 మొత్తం 44 గ్రామాలు దేవీపట్నంలోనే ముంపు గ్రామాలుగా ఉన్నాయి. 371 ముంపు గ్రామాలకు సంబంధించి పూర్తిస్థాయిలో పునరావాసానికి సంబంధించిన కసరత్తు పూర్తి కావాల్సి ఉంది. 

No comments:

Post a Comment