ఏలూరు, మార్చి 22 (way2newstv.in)
2019 ఎన్నికల్లో బి.జె.పి భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని బీజేపీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్ది మాణిక్యాన రావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లోని స్వయంభువుగా వెలసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయం లో మాణిక్యాలరావు దంపతులు సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామి వారికీ అభిషేకం నిర్వహించారు.
సోమేశ్వర ఆలయంలో మాణిక్యాలరావు పూజలు
అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఈసందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ సోమేశ్వర స్వామి ఆశీస్సులతో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. పెనుమంట్ర మండల ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి , హనుమంతరావు , ఓ.బి.సి. మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గున్నేపల్లి పుల్లాజీ , విరవల్లి. సత్యనారాయణ, చక్రపాణి, కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment