నగర టీడీపీ కేడర్‌లో నూతనోత్సాహం
రాజమండ్రి మార్చి 30 (way2newstv.in):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించిన రోడ్ షోతో తెలుగుదేశం పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది. ఆయన ఇక్కడకు చేరుకుని పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. తమ పార్టీ అభ్యర్ధులు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్ధి మాగంటి రూప, రాజమహేంద్రవరం సిటీ నియోజవర్గ అభ్యర్ధి ఆదిరెడ్డి భవానీలను గెలిపించాలని కోరారు. కాగా ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరంలో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకూ 1, 2, 6, 9, 10, 12, 13, 14, 15, 21, 22, 23, 24, 25, 29, 31, 32, 33, 34, 35, 36, 40, 41, 43, 44, 49, 50 డివిజన్లలో ఆదిరెడ్డి భావానీ విస్త్రతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. తూర్పు సెంటిమెంట్‌గా మొదటి రోజు 50వ డివిజన్‌లోని చౌడేశ్వరినగర్ నుంచి తన ఎన్నికల ప్రచారం నిర్వసించారు.
విస్త్రతంగా సాగుతున్న భవానీ ప్రచారం
అప్పటి నుంచి ఇప్పటి వరకూ 27 డివిజన్లల్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. అలాగే పార్కులు, వివిధ యూనియన్లు, వివిధ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా, మాగంటి రూపను ఎంపీగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, విభజన అంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన సమర్ధవంతమైన పాలనతో ఏ విధంగా అభివృద్ధి చేశారో భవానీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించారు. అలాగే ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, అలాగే తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం చేయనున్న ప్రణాళికలను కర పత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కాగా ఆయా డివిజన్లల్లో ప్రచారానికి వెళ్లిన భవానీకి స్థానిక మహిళలు పూల మాలలు వేసి... హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి... చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన బతులు బాగుంటాయన్న నినాదంతో భవానీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
No comments:
Post a Comment