Breaking News

23/03/2019

ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతారా

విశాఖపట్టణం, మార్చి 23 (way2newstv.in)
ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే టీడీపీకి పెట్టని కోటలు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటికి ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండు సందర్భాల్లో తప్ప మిగిలిన కాలమంతా టీడీపీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. ఐదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో ఉన్న తరువాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. అందువల్ల ప్రజా వ్యతిరేకత అన్నది ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి వైసీపీ అక్కడ సిధ్ధంగా ఉంది. వైసీపీకి అక్కడ సంస్థాగతంగా బలం కూడా ఉంది. పెద్ద నాయకులు, అనుభవం ఉన్న వారు వైసీపీలో ఉన్నారు. టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా అడ్డుకునేందుకు పవన్ గాజువాకలో పోటీకి దిగాడని తెలుస్తోంది.ఉత్తరాంద్ర్హ జిల్లాలో కాపులు, బీసీలు అధికంగా ఉన్నారు. పవన్ సైతం కాపుల జనాభా అధికంగా ఉన్న గాజువాకలో పోటీకి దిగుతున్నారు. పైగా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో గెలిచిన చరిత్ర కూడా ఉంది. 


ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతారా 

దాంతో పవన్ ఇక్కడ నుంచి బరిలో ఉంటున్నారు. పవన్ పోటీ వల్ల ఆ పార్టీ విజయావకాశాలు ఎంతవరకూ ప్రభావితం అవుతాయో విశ్లేషిస్తే కొంతవరకూ పవన్ ప్రభావం పడుతుందనే చెప్పాలి. ఇక ఆయనతో పాటు విశాఖ ఎంపీ సీటు కోసం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీకి దిగుతున్నారు. అవినీతి కేసులు విచారించిన చరిత్ర లక్ష్మీ నారాయణకు ఉంది. అదే సమయంలో ఆయన టీడీపీకి సన్నిహితమని విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే, ఓ సామాజికవర్గానికి బ్రాండ్ అంటున్న జనసేన నుంచి పోటీ చేయడం ద్వారా ఎంతవరకు కలసివస్తుందన్న ప్రశ్న కూడా ఉంది.జనసేనకు విశాఖ జిల్లాలో ఎక్కడా పార్టీ నిర్మాణం లేదు. పట్టు కూడా లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని టికెట్లు ఇచ్చేశారు. వారిలో ఎంతమందికి డిపాజిట్లు వస్తాయో తెలియదు. అయితే మాజీ పోలీస్ అధికారి, పవన్ పోటీ చేయడం వల్ల కొంతలో కొంత జనసేన‌ ఓట్లను చీలుస్తుందని అంటున్నారు. దాని వల్ల ఎవరి విజయావకాశాలు తగ్గిపోతాయో ఇపుడు చెప్పలేం కానీ, టీడీపీ, జనసేనల మధ్యన లోపాయికారి అవగాహన అన్నది ఉందనుకుంటున్న నేపధ్యంలో వైసీపీ విజయావకాశాలు ఎంతో కొంత తగ్గుతాయని అంటున్నారు. చూడాలి పవన్ ప్రచారం మొదలుపెట్టాక కానీ అసలు సంగతి బయటపడదు.

No comments:

Post a Comment