పలు సంఘాల మద్దతు
విజయవాడ, మార్చి4 (way2newstv.in)
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల 5వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి లో ఉన్న తాను ఉపాధ్యాయుల సమస్యల పై,ముఖ్యంగా సి పి ఎస్,పండిట్స్,పి ఈ టి ల అప్ గ్రేడేషన్ వంటి తీవ్ర సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి ఒక ప్రయివేట్ పాఠశాలను స్థాపించి విద్యసేవలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవంలో రాష్ట్రంలో పట్టభద్రులైన యువనేస్తాల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించానని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నేడు పట్టబద్రుల ఎమ్మెల్సీ కి కొల్లి నామినేషన్
ప్రయివేట్ పాఠశాల ల సంఘం,డాక్టర్లు, లాయర్లు, పెన్షనర్ల సంఘాలు బలపర్చిన అభ్యర్థిగా ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న తనకు నిరుద్యోగ యువత,ప్రభుత్వ, ప్రయివేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టబద్రులు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అమరావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనకళ్ల రెడ్డెమ్మ,ప్రయివేట్ పాఠశాల ల సంఘం జిల్లా కార్యదర్శి వై.సూరిబాబు,బీసీ ఐక్యవేదిక జోగి నాగేశ్వరరావు, పి ఈ టి అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ సి హెచ్ సుధాకర్,ఎస్ వెంకటేశ్వరరావు, సి హెచ్ వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, శేషాద్రి రావు,దుర్గారావు, శ్యామ్, విజయవర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment