Breaking News

30/03/2019

ఏశాట్‌ ఫై మోదీ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టిన చిదంబరం

న్యూఢిల్లీ మార్చ్ 30 (way2newstv.in):
ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం(ఏశాట్‌) ‘మిషన్‌ శక్తి’పై ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తప్పుబట్టారు. ఈ అత్యవసర ప్రకటన వెనక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉపగ్రహాన్ని కూల్చే సామర్థ్యం మన దేశానికి ఎప్పటి నుంచో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘తెలివైన ప్రభుత్వం అలాంటి సామర్థ్యాన్ని రహస్యంగా ఉంచుతుంది. దేశ రక్షణను మరచి రహస్యాల్ని బహిర్గతం చేయడం తెలివిలేని ప్రభుత్వాలు చేసే పని’’ అని ట్విటర్ వేదికగా చిదంబరం విరుచుకుపడ్డారు. 


ఏశాట్‌ ఫై మోదీ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టిన చిదంబరం

ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో అత్యవసరంగా ఇలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే భాజపా ఇలా చేసిందని ఆయన ఆరోపించారు. ‘మిషన్‌ శక్తి’ పేరిట చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్‌ నాలుగో దేశం కావడం విశేషం. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ.. మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కాదని శుక్రవారం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment