కరీంనగర్, మార్చి 25(way2newstv.in)
జనగామ జిల్లా కేంద్రాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. 1990 బృహత్ ప్రణాళికలో నిర్దేశించిన వివిధ కొలతల రహదారులను అందుకు అనుగుణంగా విస్తరించేందుకు కలెక్టర్ ఆదేశాలతో పురపాలిక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చర్యలు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వరకు బైపాస్ గా ఉపయోగపడే రహదారిపై దృష్టిసారించారు. దుకాణాదారులు, మడిగలు అద్దెకు తీసుకున్నవారు, యజమానులు తమ ఇళ్లముందు రోడ్లను చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 33 అడుగుల రోడ్డును 20 అడుగులుగా మార్చారు. నడవడానికి సైతం ఇబ్బందిగా ఉంది. కొత్త మాస్టర్‌ప్లాన్ 2019 రూపొందుతోంది. రద్దీగా ఉన్న ఇలాంటి వాటిని 40 నుంచి 50, 60 అడుగులకు విస్తరించేందుకు ప్రతిపాదించాలని యోచిస్తున్నారు.
జనగామలో ఆక్రమణలు తీసేందుకు ప్లాన్
పోచమ్మ గుడి నుంచి సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వరకు 50 అడుగులు, ఇక్కడి నుంచి ఈసేవ కేంద్రం, పోలీస్‌స్టేషన్ వరకు 40 అడుగుల రహదారిగా గత ప్రణాళికలో నిర్ధారించారు. కానీ పోలీస్‌స్టేషన్ నుంచి సుభాష్ విగ్రహం వరకు అనేక చోట్ల నిర్మాణాలు ముందుకు వచ్చాయి. రహదారి ఆక్రమణల పర్వం యథేచ్ఛగా జరిగింది. కొన్ని చోట్ల 20 అడుగుల మేర మాత్రమే ఉంది. అనుమతి లేని నిర్మాణాలు ఈ రోడ్డులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి గత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే విస్తరించాలని మార్కింగ్ ఇచ్చారు. ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాతబీటుబజారులో ఐరన్‌బజారు, బంగారం బజారు, స్వర్ణకళామందిర్, కృష్ణకళామందిర్ వెనుక, ఇరువైపులా ఉన్న వాటిని బృహత్ ప్రణాళిక ప్రకారం వెడల్పు చేసే యోచన ఉందని తెలుస్తోంది.స్టేషన్‌రోడ్డు కూడలిని 60 అడుగుల మేర, చుట్టూ దారులను 50 అడుగుల మేర విస్తరిస్తున్నారు. వ్యాపారులు మడిగలు కూల్చుకొని వెనక్కి జరిగారు..కానీ అక్రమంగా రోడ్ల మీద వ్యాపారం చేసేవారు, దుకాణాల ముందు టీకొట్టులు, పండ్ల బండ్లు, హాట్‌ఫుడ్, ఇతర పదార్థాల తయారీకి వంటపొయ్యిలను ఎదుటే పెట్టి వినియోగించుకుంటున్నారు. విస్తరణ పనులతో దుమ్ము పైకి ఎగసిపడి..చాయ్, టిఫిన్ తయారీ పదార్థాలలో కలుస్తోంది. ఆహార కల్తీ నిరోధక విభాగం అధికారులు..ఈ అంశంపై దృష్టిపెట్టి..దుకాణాల ముందు పొయ్యిలు, పదార్థాల తయారీ లేకుండా చూడాలని, తద్వారా ఆక్రమణలను నిరోధించవచ్చునని పలువురు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment