Breaking News

06/03/2019

రఘరామరాజు ముందే చేతులెత్తేశారా

ఏలూరు, మార్చి 6, (way2newstv.in)
ఊర‌క రారు మ‌హానుభావులు- అన్న‌ట్టుగానే పార్టీలు మారుతూ.. గోడ జంపింగుల‌కు అల‌వాటు ప‌డ్డ నాయ‌కులు కూడా ఊరికేనే గోడ‌దూకుళ్లు.. జంపింగులు చేయ‌ర‌నే విష‌యం వాస్త‌వం. త‌మ‌కు ఎంతో కొంత ప్ర‌యోజ‌నం లేక‌పోతే.. న‌మ్మిన పార్టీని ఎవ‌రూ పుట్టిముంచే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా!! ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిణామ‌మే ఒక‌టి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో చోటు చేసుకుంది. ఇక్క‌డ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా ఆస‌క్తిగా మారిపోయింది. త‌న‌కు పార్టీలో టికెట్ ఇచ్చే విష‌యం లో జ‌రుగుతున్న తాత్సారం కార‌ణంగానే పార్టీ మారిపోయిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.అయితే, వాస్త‌వానికి క‌నుమూరి ప‌రిస్థితి చూస్తే.. ఆయ‌న ఎప్పుడూ ఒక పార్టీలో నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు మ‌న‌కు ఎక్క‌డా క‌నిపిం చదు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు కేవీపీ రామ‌చంద్ర‌రావుకు వియ్యంకుడుగా సుప్ర‌సిద్ధుడు అయిన క‌నుమూరి.. 2014కు ముందు వైసీపీలో చేరారు. 


రఘరామరాజు  ముందే చేతులెత్తేశారా

ఈ క్ర‌మంలో ఆ పార్టీ నుంచి న‌ర‌సాపురం టికెట్ ఆశించారు. అయితే, టికెట్ విష‌యంలో తాత్సారం జ‌ర‌గ‌డంతో వెంట‌నే బీజేపీలోకి వెళ్లారు అయితే, ఇక్క‌డ టికెట్‌ను ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో గోక‌రాజు గంగ‌రాజు కు ఇచ్చారు. ఆయ‌న పోటీ చేయ‌డం గెల‌వ‌డం కూడా జ‌రిగింది. ఈ ప‌రిణామంతో క‌నుమూరి మ‌రోసారి పార్టీ మారి.. అధికార టీడీపీలోకి చేరిపోయారు.దీంతో చంద్ర‌బాబు.. క‌నుమూరి కోరిక మేర‌కు న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్తగా నిర్ణ‌యించా రు. అయితే, ఏ పార్టీలో అయినా.. ఎంపీ స్థాయి అభ్య‌ర్థి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలిపించు కోవాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఈ విష‌యంలో క‌నుమూరి మాట‌లు త‌ప్ప చేత‌లు చేయ‌డం లేద‌నే ఫిర్యాదులు ఉన్నా యి. నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు నిధులు ఖ‌ర్చు చేయాల్సి ఉన్నా.. రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌కుం డా తాత్సారం చేస్తూ.. ఇక్క‌డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు గెలిపిస్తారులే .. మ‌న‌కెందుకు అనే ధోర‌ణిని అవ‌లంబించార‌న్న వాద‌నా ఉంది. ఇదే విష‌యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు బాబుకు ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి చంద్ర‌బాబు కూడా క‌నుమూరికి బాధ్య‌త అప్ప‌గించారు. నీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల‌ను నువ్వే గెలిపించుకోవాలి! అనే ష‌ర‌తు పెట్టారు. దీనికి త‌లాడించిన‌ప్ప‌టికీ.. రూపాయి కూడా బ‌య‌ట‌కు తీయ‌కుండా ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు నేను ఖ‌ర్చు పెట్టేది ఏంటి? అనే ధోర‌ణిని అవ‌లంబించారు. దీంతో చంద్ర‌బాబు టికెట్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు జిల్లాలోని అన్ని టికెట్ల విష‌యంలోనూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చినా.. న‌ర‌సాపురం ఎంపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా దాట వేశారు. టికెట్ ఇచ్చి ఏదో ఒక విధంగా గెలిపించినా.. త‌ర‌చుగా పార్టీలు మారే ల‌క్ష‌ణం ఉన్న క‌నుమూరిని న‌మ్మ‌డం ఎలా ? అనే సందేహం కూడా చంద్ర‌బాబు మ‌దిని తొలిచింది. దీంతో ఆయ‌న టికెట్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకో కుండా ఎన్నిక‌ల కోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇంత‌లోనే ఏమైందో ఏమో.. క‌నుమూరి రఘురామ కృష్ణం రాజు టీడీపీ నుంచి జంప్ చేసి వైసీపీలోకి చేరిపోయారు. ఇక్క‌డ కూడా ఆయ‌న గ‌మ్మ‌త్తు రాజ‌కీయాలు చేశారు. జ‌గ‌న్ త‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని చెబుతూనే.. త‌న‌కు తానే న‌ర‌సాపురం టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నాడు. మ‌రి ఇలాంటి నాయ‌కుడుతో ఎవ‌రికి మాత్రం కంటిపై కునుకు ఉంటుంది? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఆయ‌న వైసీపీ ప్ర‌యాణం ఎన్ని రోజులు సాగుతుందో ? చూడాలి.

No comments:

Post a Comment