Breaking News

25/03/2019

గ్రేటర్ లో ఆకట్టుకుంటున్న వర్టికల్ గార్డెన్స్

హైద్రాబాద్, మార్చి 25(way2newstv.in)
గ్రేటర్ పరిధిలోని పైవంతెనలు పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్నాయి. ఫ్లెఓవర్ల పిల్లర్లకు హెచ్‌ఎండీఏ వర్టికల్ గార్డెనింగ్‌తో కొత్త సొబగులు అద్దుతున్నది. పచ్చని అందాలతో వంతెనలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.గ్రేటర్ పరిధిలో ఫ్లె ఓవర్లు ప్రయాణికులకు మరింత కనువిందు చేయనున్నాయి. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ైఫ్లెఓవర్లతోపాటు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ ైఫ్లెఓవర్ వర్టికల్ గార్డెన్ పనులకు శ్రీకారం చుట్టగా, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పనులు టెండర్ దశలో ఉన్నాయని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు తెలిపారు. 

గ్రేటర్ లో ఆకట్టుకుంటున్న వర్టికల్ గార్డెన్స్

హైటెక్ సిటీ జంక్షన్ ట్రాఫిక్ రహితంగా ఉండేందుకుగానూ హెచ్‌ఎండీఏ కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ ఐటీ పార్కు వరకు ైఫ్లెఓవర్ 705 మీటర్ల మేర ైఫ్లెఓవర్ నిర్మాణం చేపట్టింది. గచ్చిబౌలి ైఫ్లెఓవర్‌ను రూ.14కోట్లతో 1.45 కిలోమీటర్ల మేర చేపట్టి వాహనదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. నిర్వహణలో ైఫ్లె ఓవర్లను మరింత అందంగా తీర్చిదిద్ది ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచనున్నారు. 11.60 కిలోమీటర్ల మేర పీవీఎన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో 317 పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్  చేపట్టనున్నారు. ప్రతి వర్టికల్ గార్డెన్ ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఉంటుంది. రోజుకు 100 మిల్లీ లీటర్ల డోస్‌తో నీరు అందుతుంది. ఈ గార్డెన్ ఒక్కోసైడ్ యూనిక్వ్ డిజైన్ ఉండేలా చూశారు. ఈ పిల్లర్లకు అలంకారప్రాయమైన గ్రీన్ వాల్స్ మొక్కలను నాటనున్నారు. ఈ గార్డెన్‌లతో అన్ని పిల్లర్లను కవర్ చేశారు. ఈ వర్టికల్ గార్డెన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వేడిని తగ్గించడంతోపాటు పొగమంచు, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పక్షులు, కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. బయోడైవర్సిటీని పెంచుతుంది. ప్రధానంగా ఈ మార్గం వెంట వెళ్లే వాహనదారులు, పాదాచారులకు చక్కటి ఆహ్లాదాన్ని నింపుతుంది.

No comments:

Post a Comment