Breaking News

01/03/2019

కొనసాగుతున్న భారీ ప్రాజెక్టులు

భారీగా పెరిగిన సిమెంట్ వినియోగం
హైద్రాబాద్, మార్చి 1, (way2newstv.in
 సిమెంట్ వినియోగం 2020లో 6 నుంచి 8 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు గృహ నిర్మాణం, వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు దోహదం చేయవచ్చని ఇండియా రేటింగ్స్ అధ్యయన నివేదిక పేర్కొంది. వరుసగా ఈ సంవత్సరం కూడా డిమాండ్ అధికంగా ఉన్నందువల్ల సిమెంట్ తయారీదార్లు సైతం మంచి లాభాలను సంతరించుకునే వీలుందని తెలిపింది. 


 కొనసాగుతున్న భారీ ప్రాజెక్టులు

వ్యక్తిగత గృహ నిర్మాణం, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణంతోబాటు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల రంగాల్లో సైతం సిమెంట్ వినియోగం గణనీయంగా పెరిగిందని, ఈ పెరుగుదల మరో రెండేళ్లు కొనసాగుతుందని అంచనావేసింది. 2019 నుంచి 2021 మధ్య నిర్మాణ రంగ రంగంలో సిమెంట్ వినియోగ సామర్ధ్యం సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల వరకు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 2020లో ఈ పెరుగుదల అధికంగా ఉంటుందని పేర్కొంది. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తేడావల్ల వచ్చే సంవత్సరం సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది.

No comments:

Post a Comment