Breaking News

07/03/2019

హరితహరం నర్సరీలను పరిశీలించిన సీఎం ఓఎస్డీ

సుర్యాపేట, ఫిబ్రవరి 07 (way2newstv.in
త్వరలో ప్రారంభం కానున్న ఐదవ విడత తెలంగాణకు హరితహారం నర్సరీల ఏర్పాటుపై సీఎం కార్యాలయం అధికారి ప్రియాంక వర్గీస్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం సూర్యాపేట జిల్లా పిన్నాయపాలెం గ్రామంలో హరితహరం నర్సరీలను పరిశీలించారు. నర్సరీల నాణ్యతపై అసంతృప్తి, మరింత సమర్ధవంతంగా మొక్కల పెంపకం చేపట్టాలని, ప్రతీ గ్రామంలో నర్సరీ ఉండేలా చర్యలకు ఆదేశించారు.


హరితహరం నర్సరీలను పరిశీలించిన సీఎం ఓఎస్డీ

ప్రజలు కోరే మొక్కలు అందించేలా  నర్సరీలు ఉండాలి.  వేసవిలో నర్సరీలు, ఇప్పటికే నాటిన మొక్కలు ఎండిపోకుండా నీటి సదుపాయం కల్పించాలి.  శాఖల మధ్య సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ కోరుకుంటున్న పర్యావరణ హితాన్ని అందరూ అర్ధం చేసుకొని మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని ఆమె అన్నారు.  ప్రియాంక వర్గీస్ పర్యటనలో  జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్,  డి. ఆర్.డి.ఓ  పి.డి కిరణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గోన్నారు..

No comments:

Post a Comment