హైద్రాబాద్, మార్చి 2, (way2newstv.in)
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తరువాత సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఇందుకోసం కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ లోక్ సభ అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఒక్కో స్థానానికి రెండు మూడు పేర్లతో జాబితాను తయారు చేసిన టీ పీసీసీ... ఆ జాబితాను హైకమాండ్‌కు పంపించింది. ఇందులో ఎక్కువగా పోటీ లేని కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్ధులను బరిలోకి దించేందుకు జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల వివరాలను ఇప్పటికే సేకరించింది.
మార్చి 6 తర్వాత టీ కాంగ్రెస్ జాబితా
అయితే ఎవరిని బరిలోకి దింపాలన్న అంశంపై ఇప్పటికే టిపిసిసి ఒక జాబితాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాబితా పరిశీలన కోసం టిపిసిసి నాయకత్వం ఇప్పటికే ఎఐసిసికి అందచేసినట్టుగా సమాచారం.ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంత మంది నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు, వారిలో దీటైన అభ్యర్థులు ఎవరు,అన్న తదితర అంశాలను కూడా టిపిసిసి అధిష్టానికి అందచేసిన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అయితే ఇంకా ఎన్నికల షెడ్యుల్ వెలువడని నేపథ్యంలో రెండు, మూడు దఫాలుగా పార్టీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం చేపట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరమే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించే అవకాశమున్నట్లుగా పార్టీ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పదిహేను లోక్‌సభ నియోజకవర్గాలకు గాను దాదాపుగా పదహారు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించారు.మార్చి 6 తరువాత ఏ క్షణంలోనైనా ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పొత్తులు లేకుండానే 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. భువనగిరి నుంచి మధుయాష్కీ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నుంచి సోహెల్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి నుంచి కూన శ్రీశైలం గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఇందుకోసం ఆయనను ఒప్పించే బాధ్యతను టీ పీసీసీకి అప్పగించిందని సమాచారం.ఇక ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, జహీరాబాద్ స్థానాలకు కోసం ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో... ఇక్కడి ఎవరికి ఛాన్స్ లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెదక్ స్థానానికి గాదె అనిల్ కుమార్ ను ఫైనల్ చేయడంపై పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌పార్టీ క్యాంపు రాజకీయం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ క్యాంపు రాజకీయం షురూ చేసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే....ఆరుగురు పోటీలో ఉండటంతో కాంగ్రెస్‌కు క్యాంపు రాజకీయం అనివార్యమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పరిస్థితిపై పార్టీ ముఖ్యనేతలు చర్చించినట్టు తెలిసింది. ముందస్తు ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 9 మంది సీనియర్ ఎమ్మెల్యేలు, 10 మంది జూనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జూనియర్ ఎమ్మెల్యేలను అధికార టీఆర్‌ఎస్ లాగే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంతోపాటు వారిని ఎక్కడో ఒక చోట క్యాంపు వేయాలని భావిస్తున్నది. పది రోజులపాటు కర్నాటక రాష్ట్రానికి తరలించాలా? లేదా విదేశాలకు తరలించాలా? లేక ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే అక్కడే ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకోవాలా? ఇలా అనేక అంశాలపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. రెండు రోజుల్లో క్యాంపునకు తుదిరూపం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ క్యాంపునకు యువ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు
No comments:
Post a Comment