Breaking News

23/03/2019

పవన్‌కళ్యాణ్ ఆస్తులు రూ.40.81 కోట్లు

ఇదే తరహాలో జనసేన అభ్యర్థుల నామినేషన్లు
పార్టీ అధినేత ఆస్తులు రూ.40.81 కోట్లు, అప్పులు రూ.33.72 కోట్లు
విశాఖపట్నం మార్చ్ 23 (way2newstv.in
 ప్రజాసేవ చేయాల్సిన నాయకులు కులమతాలకు అతీతంగా ఉండాలన్న ఉద్దేశంతో... పవన్‌కల్యాణ్‌, లక్ష్మీనారాయణ సహా పలువురు జనసేన అభ్యర్థులు కులమత ప్రస్తావనలకు తావులేకుండా నామపత్రాలు సమర్పించారు. దరఖాస్తు తిరస్కరణకు గురైన పక్షంలో తనకు బదులుగా బరిలో ఉండాల్సిన వ్యక్తి పేరును కూడా నామపత్రంలో పవన్‌కల్యాణ్‌ సూచించలేదు.
ప్రమాణపత్రంలో పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించిన ఆదాయం, అప్పులు, ఆస్తుల వివరాలు.
స్థిరాస్తుల మొత్తం విలువ: రూ. 40.81 కోట్లు.
అప్పులు రూ. 33.72 కోట్లు.
చరాస్తుల విలువ: రూ.12 కోట్లు.
2016-17లో ఆదాయం: రూ.15,28,71,589
2017-18లో ఆదాయం: రూ. 9,50,14,927.
అడ్వాన్స్‌ ట్యాక్స్‌ రూ. 60,17,967 చెల్లించారు.
వాహనాలు:

పవన్‌కళ్యాణ్ ఆస్తులు రూ.40.81 కోట్లు 

రూ. 72.95 లక్షల మెర్సిడస్‌ బెంజ్‌ ఆర్‌ క్లాస్‌ కారు,.
రూ. 21.50 లక్షల ఫార్చూనర్‌ కారు, రూ. 27.67 లక్షల స్కోడాకారు, రూ. 13.82 లక్షల మహీంద్రా స్కార్పియో, రూ.1.06 కోట్ల విలువైన వోల్వో ఎక్స్‌.సి.90 కారు, రూ. 32.66 లక్షల విలువైన హార్లే డేవిడ్‌సన్‌ వాహనం ఉన్నాయి.
భార్య పేరు మీద...
ఞ జీవిత భాగస్వామి చరాస్తుల విలువ రూ. 30.50 లక్షలు. శంకరపల్లి మండలం జన్‌వాడ గ్రామంలో మూడు ప్రాంతాల్లో 18 ఎకరాల పొలం, ఆరుచోట్ల వ్యవసాయేతర స్థలాలు నివాస భవనం ఒకటి చొప్పున ఉన్నాయి. భార్యకు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సింగిల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌ ఉంది. భార్య పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.40 లక్షలు. తనపై నలుగురు ఆధారపడి ఉన్నట్లు చూపారు. వారిలో ఇద్దరికి రూ.కోటి చొప్పున డిపాజిట్లు, ఒకరికి రూ. 29.58 లక్షల డిపాజిట్‌ చూపారు.
ఎవరి దగ్గర నుంచి ఎంత రుణం..
పవన్‌ తీసుకుకున్న రుణాల మొత్తం విలువ: రూ.33,72,65,361.
హెచ్‌.డి.ఎఫ్‌.సి. నుంచి రూ. 9.82 కోట్లు.
 ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నుంచి రూ. 68.63 లక్షలు.
హెచ్‌.డి.ఎఫ్‌.సి. బ్యాంకు ఒ.డి. రూ.2.10 కోట్లు.
దర్శకుడు ఎ.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుంచి రూ. 2.40 కోట్లు.
హారిక - హాసిని క్రియేషన్స్‌ నుంచి వ్యక్తిగత రుణం రూ. 1.25 కోట్లు.
వదిన కె.సురేఖ నుంచి రూ. 1.07 కోట్లు.
ఎం.ప్రవీణ్‌కుమార్‌ నుంచి రూ.3 కోట్లు.
ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్రసాద్‌ నుంచి రూ.2 కోట్లు.
బాలాజీ సినీ మీడియా నుంచి రూ. 2 కోట్లు.
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర నుంచి రూ. 27.55 లక్షలు.
వై.నవీన్‌కుమార్‌ నుంచి రూ. 5.50 కోట్లు.
చెల్లించాల్సిన ఇతర మొత్తాలు రూ. 3.60 కోట్లు.

No comments:

Post a Comment