Breaking News

14/03/2019

సత్తెనపల్లి నుంచి కోడెలపోటీ.. 22న నామినేషన్‌

గుంటూరు మార్చ్ 14  (way2newstv.in)
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని శాసనసభాపతి కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. మార్చి 22వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకర్లతో మాట్లాడారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామని చెప్పారు. తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇస్తున్నానని తెలిపారు. సత్తెనపల్లిలో 15వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.


సత్తెనపల్లి నుంచి కోడెలపోటీ.. 22న నామినేషన్‌

No comments:

Post a Comment