Breaking News

22/02/2019

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన కేంద్ర బృందం

పథకాలు అమలవుతున్న తీరు భేష్ - కేంద్ర బృందం ప్రశంసలు
కామారెడ్డి, ఫిబ్రవరి 22,(way2newstv.in)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాల అమలు తీరు, ఈ ఈ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ది, లోటుపాట్లను  కామారెడ్డి జిల్లాలో కేంద్ర మానిటరింగ్ బృందం సభ్యులు సునీల్,  సూర్ ఫికర్ లు పరిశీలించారు. జిల్లాలో పథకాల అమలు భేషుగ్గా ఉందని ప్రశంసించారు.4 రోజులుగా కామారెడ్డి జిల్లా లోని జుక్కల్, బాన్సువాడ మండలాలలో వివిధ గ్రామాలలో పర్యటించిన సభ్యులు మొక్కల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సిసి రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణం బాన్స్వాడ మండలంలోని కోనాపూర్ గ్రామం లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. 


కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన కేంద్ర బృందం

ఈరోజు నస్రుల్లాబాద్ మండలం లోని బొ ప్పాజీపల్లి, బొమ్మను దేవుపల్లి గ్రామాలలో పర్యటించారు, బొ ప్పాజీజి పల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల రిజిస్టర్లను సరిగా నిర్వహించడం లేదని, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బొమ్మను దేవ్ పల్లి గ్రామంలో  పావలా వడ్డీ, వృద్ధాప్య పెన్షన్లు అందుతున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్రామ సంఘం సభ్యులతో  సమావేశం అయ్యారు. గ్రామ సంఘం సభ్యుల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాల గురించి తెలుసుకున్నారు, కేంద్ర బృందం సభ్యులు సునీల్ గ్రామీణాభివృద్ధి శాఖ లో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను వారి ఉపాధి కార్డులలో నమోదు చేసిన వివరాలను, గ్రామస్థాయిలో నిర్వహించవలసిన 7 రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు, బొమ్మను దేవుపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కాశి రామ్ టెక్నికల్ అసిస్టెంట్ లావణ్య లను అభినందించారు.అనంతరం పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను, కంపోస్ట్ ఎరువు గుంతను, నిర్మాణంలో ఉన్న వంటగది స్కూల్ టాయిలెట్లను పరిశీలించారు, నీటిని భూమిలోకి ఇంకేంప చేయుటకు నిర్మించిన ఫారం పాండు ను పరిశీలించారు. బీర్కుర్  మండలం అన్నారం గ్రామంలో పనులను పరిశీలించిన తర్వాత , అనంతరం కామారెడ్డి లో కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ తో  పరిశీలించిన పనుల పూర్తి  అంశాలను వివరించారు,  నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొమ్మను దేవ్ పల్లి గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పెన్షన్స్ డి పి ఎం విలాస్ రావు, బీర్కుర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ , తదితర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment