Breaking News

18/02/2019

పోలీస్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశృతి

యువతి మృతి
కరీంనగర్, ఫిబ్రవరి 18, (way2newstv.in)  
పోలీసు కానిస్టేబుల్ కావాలని ధ్యేయంతో మూడు నెలలు శ్రమపడి ఆపై ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షకు హాజరైన యువతి అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ ఘటన  సోమవారం ఉదయం సుమారు   సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన వడ్లకొండ మమత (22) గత కొంత కాలంగా కరీంనగర్ లోని ఓ ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ వుంది. పో సోమవారం ఉదయం  పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు పరీక్షల నిమిత్తం చేరుకున్న మమత రన్నింగ్ పరీక్షలో నెగ్గేందుకు రన్నింగ్ చేసింది.  


పోలీస్  ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అపశృతి

అయితే పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె కన్నుమూసింది. అలాగే స్పృహ తప్పిపడిపోయిన మరో ఇద్దరు అభ్యర్థులను ఆస్పత్రికి తరలించారు. ఇరువురిని జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు.   మృతురాలు మమత చదువులో చాలా చురుకుగా వుండేదని, తండ్రి సంపత్ ఆటో నడుపుతూ ఉంటుండగా చెల్లెలు ఇద్దరు చదువుతుండడంతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ రెడీమేడ్ షర్టులు కుడుతుందని బంధువులు తెలిపారు. ఘటన విషయం తెలియగానే మమత మృతదేహాన్ని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి పరిశీలించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని,  ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేస్తామని  అన్నారు.  పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా గ్రేడింగ్ తీసుకున్న తర్వాత ఇలాంటి పరీక్షలకు హాజరైతే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment