Breaking News

11/02/2019

తెలంగాణ విద్యార్ధులకు న్యాయం చేయండి

హైద్రాబాద్, ఫిబ్రవరి 11  (way2newstv.in)
లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. యూఎస్‌లో అరెస్టయిన తెలంగాణ విద్యార్థులను విడిపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యూఎస్‌కు చెందిన హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విదేశీయులకు ఎర వేసింది. పే టూ స్టే పేరుతో విద్యార్థులకు వల వేసింది. ఈ ట్రాప్‌లో పడిన 600 మంది విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.



తెలంగాణ విద్యార్ధులకు న్యాయం చేయండి 

వాళ్లలో తన నియోజకవర్గం మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని.. తెలంగాణకు చెందిన విద్యార్థులు 129 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని జితేందర్ రెడ్డి తెలిపారు. అది ఫేక్ యూనివర్సిటీ అని విద్యార్థులకు తెలియదని.. వాళ్లు యూఎస్‌కు అక్రమంగా వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై ఇదివరకే మాట్లాడారని.. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కాన్సులేట్ జనరల్ ద్వారా తెలుసుకుంటున్నట్టు జితేందర్ రెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడి పిల్లలు లక్షల రుణం తీసుకొని విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారు. ఇండ్లు కూడా తాకట్టు పెట్టి విదేశాలకు వెళ్తారు. లోన్ తీర్చడం కోసమే చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లను యూఎస్ నుంచి భారత్‌కు పంపించేస్తే వాళ్లను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్లపై యూఎస్ ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకునేలా చేసి వాళ్లను భారత్‌కు తీసుకొచ్చి ఆదుకోవాలని జితేందర్ రెడ్డి కోరారు.

No comments:

Post a Comment