Breaking News

23/02/2019

కుట్టు మిషన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే

ఏలూరు, ఫిబ్రవరి 23 (way2newstv.in
ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెంది సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషలు కష్టపడుతున్నారని ఏలూరు శాసన సభ్యులు బ డేటి బుజ్జి చెప్పారు. ఇంటింటా బడేటి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 38వ డివిజన్ లోని ఇస్రాల్ పేట, లంకపేట ప్రాంతాలలో విస్త్రతంగా పర్యటించి ప్రభుత్వంఅమలుచేస్తున్న కార్యక్రమాలను  బడేటి బుజ్జి ప్రజలకు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా బడేటి ట్రస్ట్ తరపున లంకపేట కమ్యునిటీ హాలులో 100 కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. 


 కుట్టు మిషన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే

ప్రతి పేద కుటుంబం కనీసం నెలకు 10 వేల రూపాయల ఆదాయం సంపాదించుకోవాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. తమ కుటుంబ పోషణకు కుట్టుమిషన్లు ఆశరాగా వుంటాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతికుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా తమ కాళ్లపై తాము నిలబడి స్వచ్ఛంధంగా సంపాదించుకోవాలనే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అందాలని అందుకే మీవద్దే వచ్చి సక్రమంగా అందుతున్నదీ లేనిదీ తెలుసుకుంటూ ఇంకా అందవారికి తప్పని సరిగా వారి అర్హతమేరకు అందిస్తామని  బడేటి బుజ్జి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడే తప్పని సరిగా ముఖ్యమంత్రి అవుతారని నినాదాలు చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోఅప్షన్ సభ్యులు  ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ జంజు నిర్మల కుమారి మోజెష్, నాయకులు వందనాల శ్రీను, సయ్యద్ నజార్, శివ, రాజేష్, బాబ్జి, పండు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment