Breaking News

12/02/2019

బాపినీడు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైద్రాబాద్, ఫిబ్రవరి 12 (way2newstv.in
సినీ దర్శకుడు విజయ బాపినీడు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. విజయ బాపినీడు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు ప్రజలకు పలు విజయవంతమైన చిత్రాలను బాపినీడు అందించి, తెలుగు సినీరంగ చరిత్రలో చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్నారు. 


 బాపినీడు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో అనారోగ్యంతో(86) క‌న్నుమూశారు. చిరంజీవి, శోభ‌న్ బాబుల‌తో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయ‌న గ్యాంగ్ లీడ‌ర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మ‌గ‌ధీరుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి అందించారు. విజయ బాపినీడు అస‌లు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న విజ‌య బాపినీడుగా సుప‌రిచితం. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో ఆయ‌న జన్మించారు. గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. ఆయ‌న మృతికి చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుతున్నారు. విజయ బాపినీడు ద‌ర్శ‌కుడిగా డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామిలీ (1994) వంటి చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది (1976) అనే చిత్రం చేశారు. సినిమా దర్శకులుగా, పత్రికా సంపాదకులుగా విజ‌య బాపినీడు సేవ‌ల‌ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment