Breaking News

25/02/2019

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

అమరావతి,ఫిబ్రవరి 25, (way2newstv.in)
ఆయుష్మాన్ భారత్ లో మన రాష్ట్రం దేశంలోనే ముందుంది. జలవనరులశాఖకు 7 అవార్డులు వచ్చాయి. ఇంధన పొదుపులో నెంబర్ వన్ గా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీ పునేటా అన్నారు. సోమవారం అయన నీరు ప్రగతి పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. సీఎస్ మాట్లాడుతూ  వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. నీటితో చెరువులను నింపాలి.  తాగునీటి వనరులను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్నచోట్ల చలివేంద్రాలను నిర్వహించాలి. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి. 


నీటి ఎద్దడి లేకుండా చూడాలి

జిల్లా   కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మూడు శాఖలు సమన్వయంగా పనిచేయాలి గ్రామీణ నీటి సరఫరా,  పంచాయితీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయం చేసుకోవాలని అన్నారు. నరేగా కింద రూ.8,200కోట్లు ఖర్చుచేశాం. నరేగా లక్ష్యం రూ.10వేల కోట్లను చేరుకోవాలి. 42లక్షల మంది రైతుల ఖాతాల్లో ‘సుఖీభవ’ రూ.1,000 జమ అయింది. మిగిలిన ఖాతాల్లో కూడా వెంటనే జమ చేయాలి. ‘అన్నదాత సుఖీభవ’ కౌలురైతులకు కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపినేనని అన్నారు. రైతులు అందరికీ ‘సుఖీభవ’ ప్రయోజనం అందించాలి. కౌలురైతులకు ఈ ఏడాది రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇస్తున్నాం.  రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు అందరిలో భరోసా కల్పించాలి. వర్షాభావంలోనూ పంట దిగుబడులు తగ్గకుండా చూశాం. జల సంరక్షణ, సమర్ధనీటి నిర్వహణతో సత్ఫలితాలు ఇచ్చాయని అయన అన్నారు.

No comments:

Post a Comment