ఖమ్మం, ఫిబ్రవరి 7, (way2newstv.com)
ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఓటు ను ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, అస్తిత్వాన్ని కాపడేలా విలువలతో కూడిన ఓటింగ్ కు సమాజంలోని ప్రతిఒక్కరు కృషి చెయ్యాలని మధ్యప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి యల్.వెంకటేశ్వర్లు అన్నారు.
విలువలతో కూడిన ఓటింట్ జరగాలి
గడిచిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎన్నికలు నిర్వహించిన తీరు, ఓటింగ్ శాతం,ఓటర్ నమోదు లాంటి పలు అంశాలను తెలుసుకోవటం తో పాటు ఓటర్ అవగాహన కొరకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.అనంతరం ప్రజ్ఞా మందిరంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ భారత దేశంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవస్థ, ఎన్నో సంస్కరణలు చేపడుతున్నప్పటికి క్షేత్ర స్థాయిలో ఓటు వినియోగం లో మద్యం,నగదు,ప్రలోభాల పర్వం కొనసాగుతుందని,అటువంటి పరిస్థితులను రుపుమాపాలని, ఓటరు తో పాటు రాజకీయ పార్టీల నాయకుల లో ఆలోచన తీరులో మార్పురావలసిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం రాజకీయం కాదు, ప్రజల కోసం రాజకీయం అనేలా వ్యవస్థ ఉండాలన్నారు. ఓటర్ ను అవగాహన కల్పించడంలో ప్రజాస్వామ్య వాదులు,స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు బాగస్వామ్యులు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment