హైద్రాబాద్, ఫిబ్రవరి 18, (way2newstv.in)
తన నాన్న జీవితాన్ని నటన పరంగా…రాజకీయ జీవితం పరంగా తెరపై చూపించాలని కంకణం కట్టుకుని కూర్చున్న బాలకృష్ణ కల నిజమైంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే బాలకృష్ణ అనుకుంది చేసాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ నుండి మహానాయకుడు రిలీజ్ కావాల్సివుంది. నిన్న ఈసినిమా యొక్క ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈసినిమా మొత్తం ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించే ఉండనుంది.నటుడుగా ఎన్టీఆర్ ఎంత సక్సెస్ అయ్యాడో రాజకీయ నేతగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. అఖండ విజయంతో ఆయన్ను శిఖర స్థాయికి చేర్చిన తెలుగు జనమే.. అదే మనిషికి పతనావస్థను కూడా రుచి చూపారు.
బాలయ్య స్టోరీపై వీడని సస్పెన్స్
ఇవన్నీ పక్కన పెడితే ఆయన తెలుగుదేశం ప్రస్థానంలో రెండు కీలక వివాదాలు. ఒకటి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు. ఇంకోటి లక్ష్మిపార్వతి ఎంట్రీని విభేదించి చంద్రబాబు చేసిన తిరుగుబాటు. మరి ఈ రెండు అంశాలను బాలయ్య ఎలా డీల్ చేసాడనేది పెద్ద సస్పెన్స్.మరి ఈరెండు ఘట్టాల్నీ సినిమాలో చూపిస్తారా? లేక చూపించారా? అనేది నిన్న వచ్చిన ట్రైలర్ తో అర్ధం అయిపోయింది. సినిమా లో ముప్పాతిక భాగం ‘నాదెండ్ల వెన్నుపోటు’ గురించే ఉండబోతున్నట్టు అర్ధం అవుతుంది. చంద్రబాబు పాత్ర మామ వెనుకే నడిచినా, రెండో ‘వెన్నుపోటు’ను సినిమాలో ఉద్దేశపూర్వకంగానే మిస్ చేసినట్లు స్పష్టమైపోయింది. లక్ష్మి పార్వతి తో రెండో పెళ్లి, ఫామిలీ లో విభేదాలు, వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పుల దాడి ఇవన్నీ ‘మహానాయకుడు’లో మచ్చుకైనా వుండబోవన్నది క్లియర్ గా అర్ధం అవుతుంది. అయితే ఇవి అన్ని రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ లో చూపించనున్నాడు. అందుకే చాలామంది ‘మహానాయకుడు’ కన్నా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసమే వెయిట్ చేస్తున్నారు.
No comments:
Post a Comment