హైదరాబాద్, ఫిబ్రవరి 9,(way2newstv.in)
పంజాగుట్ నిమ్స్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది. నిమ్స్ లో గతంలో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న మహేశ్వరి కడుపులో కత్తెర మరచిపోయారు. పేషంట్ కు కుట్లు వేసి తరువాత ఇంటికి పంపించారు. ఆపరేషన్ తర్వాత మహిళా రోగి మహేశ్వరి చౌదరికి తీవ్రమైన కడుపునొప్పి వస్తు వుండేది. కడుపులో ఏముందో తెలుసుకునేందుకు ఎక్స్ రే చేయించడంతో అసలు విషయం బయటపడింది. పేషంట్ బంధువులు డాక్టర్లను నిలదీయండంతో మరోసారి సర్జరీ చేసి..కడుపులోని కత్తెరని బయటకు తీస్తామని వైద్యులు సముదాయించారు. వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువుల మండిపడ్డారు.
కడుపులో కత్తెర మరచిన నిమ్స్ వైద్యులు
తరువాత మ్స్ లో రోగి బంధువుల ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు నిమ్స్ కు చేరుకుని బంధువులను శాంతపరచారు. ఘటనపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ కడుపులో కత్తెర మరిచిపోవడం దురదుష్టకర ఘటన అని అన్నారు. మహేశ్వరీ చౌదరీ అనే మహిళ డైయాఫ్రమెటిక్ హెర్నియా వ్యాదితో నిమ్స్ కు వచ్చారు. అక్టోబర్ 28 2018 రోజున నిమ్స్ కు వచ్చారు. నవంబర్ 2న మహేశ్వరీ చౌదరీకి సర్జరీ జరిగింది. నవంబర్ 12 న మహేశ్వరీ డిశ్చార్జ్ చేశామని అన్నారు. ఆపరేషన్ తర్వాత మహేశ్వరి చౌదరి కడుపులో నిమ్స్ వైద్యులు మరిచిపోయి కుట్లు వేశారు. కడుపు నొప్పి రావడంతో బాధిత మహిళ మళ్లీ నిమ్స్ కు వచ్చింది. ఎక్స్ రే తీస్తే మహేశ్వరీ కడుపులో కత్తెర ను గుర్తించామని వెల్లడించారు. పేషంట్ కు ప్రొఫెసర్ వీరప్ప, వేణు, వర్మ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ రిపోర్ట్స్ వచ్చాక ఘటనకు కారణమైన వైద్యలపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
No comments:
Post a Comment