Breaking News

26/02/2019

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (way2newstv.in
పుల్వామాపై దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తూ.. ముష్కర మూకల్ని అంతం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించి శత్రు స్థావరాలను మట్టుబెట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజామున మిరాజ్-2000 యుద్ధ విమానాలతో దాడిచేసింది. 


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్

ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌తో పాటూ జాతీయ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా పాక్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ స్పందించారు.

No comments:

Post a Comment