Breaking News

23/02/2019

మరో వారంలో బెజవాడ టూ కొచ్చిన్

విజయవాడ, ఫిబ్రవరి 23,(way2newstv.in)
కేరళ రాష్ట్రంలోని కొచిన్‌కు విజయవాడ నుంచి విమాన సర్వీసు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మార్చి 1నుంచి కొచిన్‌కు విమాన సర్వీసు నడ పటానికి స్పైస్‌జెట్‌ సంస్థ ముందుకు వచ్చింది. తిరుపతి నుంచి వచ్చే ఈ సర్వీసు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి వయా తిరుపతి మీదుగా కొచిన్‌ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం కొచిన నుంచి బెంగ ళూరు మీదుగా విజయవాడకు తిరిగి తిరుపతికి ఈ సర్వీసు చే రుకుంటుంది. 


మరో వారంలో బెజవాడ టూ కొచ్చిన్

స్పైస్‌జెట్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు రెండు రాష్ర్టాలకు విమాన కనెక్టివిటీ ఏర్పడుతుంది. కొత్తగా కేరళ రాష్ర్టానికి కనెక్టివిటీ ఏర్పడుతుండడంతో శబరిమలై వెళ్ళేవారికి ఈ సర్వీసు బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి, శబరిమలైలను రెండింటినీ దర్శించుకోవాలనుకునే వారికి కూడా ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది.మరో వైపు బెంగళూరుకు అదనపు సర్వీసు అనుసంధానమౌతుంది. బెంగళూరుకు ఇప్పటికే స్పైస్‌జెట్‌ సంస్థతో పాటు, ఇండిగో విమానయాన సంస్థ కూడా విమానాలను నడుపుతోంది. కోస్తా ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కేరళకు వెళ్ళే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు పర్యాటక సంస్థలు, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు కల్పిస్తుండటంతో వాటికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం కొచిన్‌కు విమాన సర్వీసు ప్రారంభించటంతో ఈ సంస్థల మీద పరోక్ష ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కొచిన్‌కు ఎంత ఛార్జీ నిర్ణయిస్తారన్నది తెలియాల్సి ఉంది. అధికారికంగా త్వరలో స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

No comments:

Post a Comment