Breaking News

28/02/2019

బాసర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు

రూ.50 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు
బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బాసర, ఫిబ్రవరి 28 (way2newstv.in)
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి  ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని  అటవీ,పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.  దేవాదాయ శాఖ మంత్రిగా రెండోసారి పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి  మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. 


బాసర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు

గురువారం సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.50 కోట్లతో బాసర క్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ పూర్తైన వెంటేనే సీయం కేసీఆర్ ఆదేశాల మేరకు టెండర్లను పిలిచి పనులు మొదలుపెడ్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి,ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment