బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్ ఫిబ్రవరి 18 (way2newstv.in)
టిఆర్ఎస్ ఎన్ని గెలిచినా ప్రధాని కాలేరని ఇది తెలంగాణ ప్రజలకు తెలుసని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.కేంద్ర పథకాలను తెలంగాణ లో అమలు పరచకుండా పెద్ద తప్పిదం చేస్తున్నారని ప్రధాన మంత్రి సురక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా కల్పిస్తున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ బక్తులకు - స్వార్థపరులకు నీతిమంతులకు - అవినీతిపరులకు మధ్య జరిగే ఎన్నికలన్నారు. అవినీతి పార్టీలకు తగిన బుద్ధి చెప్పి బిజెపిని అత్యధిక మెజార్టీతో దేశ ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.
కేంద్ర పథకాలు అమలు చేయకుండా తప్పిదం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు తెలివైన వారని కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాల పనితీరును బిజెపి 55 నెలల పనితీరును బేరీజు వేస్తారని ప్రధానిగా తిరిగి శ్రీ నరేంద్రమోడీ ఎన్నిక కావడం తథ్యమని అన్నారు.తెలంగాణలో కూడా అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తామని జరిగిన ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రధాని అందుకోవడానికి దేశవ్యాప్తంగా గడిచిన మూడు నెలల్లో 11 లక్షల కుటుంబాలు పథకాన్ని ఉపయోగించుకున్నారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ పథకం అమలు చేయడానికి ఆలోచించాలని కోరారు.స్వచ్ఛభారత్ పేద మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు రైతులకు ఆరువేల రూపాయలు ఆర్థిక సహాయం ముద్ర బ్యాంకు ద్వారా రుణాలు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.మహా కూటమిగా ఏర్పడిన కొన్ని పార్టీలు మోడీపై కక్షగట్టి ఓడిస్తాం అంటున్నారని దేశ ప్రధాని ఎవరు అనే దానిపై ప్రజలు తీర్పు ఇస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రధాని ఎవరో చెప్ప గలుగుతారా అని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు.రాబోయే ఎన్నికలలో బిజెపి ఎన్ డి ఏ మోడీని ఏ శక్తీ అడ్డుకోలేదని బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ప్రధాని శ్రీ నరేంద్రమోడీ తిరిగి ఎన్నికవుతారని అన్నారు.శివసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ పి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా బిజెపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో చేరారు వారికి బిజెపి కండువాలు కప్పి ఆహ్వానించారు
No comments:
Post a Comment