Breaking News

16/02/2019

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా ఆమోదం

అమరావతి ఫిబ్రవరి 16 (way2newstv.in
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి చేసినరాజీనామాను శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆమోదించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేయాలని సోమిరెడ్డి భావిస్తున్నారు. 


 సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా ఆమోదం

అందుకోసం ఈ సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ విషయంపై శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ .. సోమిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్నారు. ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని సోమిరెడ్డి చెప్పటంతో రాజీనామాను ఆమోదించారు.2016లో గవర్నర్‌ కోటాలో సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయంతెలిసిందే. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉండగానే రాజీనామా చేశారు.ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

No comments:

Post a Comment