హైద్రాబాద్, ఫిబ్రవరి 12 (way2newstv.in):
చంద్రబాబు ఢిల్లీ దీక్ష అనేది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకోసమే. పార్టీ కార్యక్రమాలను పార్టీ డబ్బుతో నిర్వహించుకోవాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ రిచ్ గానే ఉందికదా. ప్రభుత్వ ధనం దేనికని వైకాపా నేత సి రామచంద్రయ్య ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్ట్ లను తాబేదార్లను తీసుకువెళ్లి ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ ఖజానానుంచి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పచ్చమీడియా ప్రతినిధులను సైతం తీసుకువెళ్లి వారికి ఖరీధైన వసతి కల్పించి ప్రచారం చేసుకున్నారని అయన ఆరోపించారు.
రాహుల్ తల్లి, వంశాన్ని చంద్రబాబు తిట్టిన విషయం మరిచారా
చంద్రబాబు విషయం తెలుసు కాబట్టే కామ్రెడ్ లు ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఏంటి డ్రామాలు.నిన్న నీ దగ్గరకువచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్ లో మన ఏపి. డిమాండ్ లపై మధ్దతు ఇచ్చిన వారే. కొత్తగా నీవు సాధించిందేంటి. కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినపుడు మధ్దతు పలికినవారే ఇప్పుడు వచ్చినవారు కూడా. ఏ ఐ సిసి కోశాధికారిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికలలో తెలంగాణా రాష్ర్టంతోపాటు కాంగ్రెస్ పార్టీ గెలిచిన పలు రాష్ర్టాలలో తన వల్లే గెలుపు జరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. చంద్రబాబుతో కలసి తిరిగేందుకు రాహుల్ పౌరుషం ఉందా? -రాహుల్ తల్లిని,వంశాన్ని చంద్రబాబు తిట్టిన విషయం మరిచిపోయారా అని అన్నారు. కేవిపి రామచంద్రరావు ఆందోళన చేసిన సందర్భంలో టిడిపి సభ్యులు ఒక్కరు కూడా నోరుమెదపలేదు. రాహుల్ గాంధిని చూసి నవ్వాలో ఏడ్వాలో నాకు అర్దం కాలేదు.నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీవు గుంటూరు వస్తే గోబ్యాక్ అని చంద్రబాబు రాళ్లు వేయించారు.కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేయించారు. ఇవన్నీ తెలిసి చంద్రబాబుతో కలిశారంటే రాహుల్ కు దేశాన్ని,కాంగ్రెస్ ను నడిపించే మెచ్యూరిటి ఉందా అని అన్నారు. స్పెషల్ ప్యాకేజి చంద్రబాబు కోరుకున్నారు తప్పితే వేరెవరు కాదని అన్నారు.
No comments:
Post a Comment