Breaking News

23/02/2019

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరు నెలల్లో భూరికార్డుల ప్రక్షాళన

దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి
అమెరికా తెలివి లేక అప్పులు చేసిందా 
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్
హైదరాబాద్‌ హైదరాబాద్ ఫిబ్రవరి 23 (way2newstv.in
అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆరు నెలల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినం. పాత పాసు బుక్కుల్లో ఉన్న 33 అనవసర కాలమ్స్‌ ఎత్తివేసినం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే ఆరు నెలల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తాం. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. గంట గంటకు రికార్డులు అప్‌డేట్‌ అవుతాయని సీఎం వివరించారు.ప్రతిపక్షాలు కొత్త విషయాలు మాట్లాడి ఉంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు. అటవీ భూములను ఆక్రమించిన వారిలో అనర్హులనే ఖాళీ చేయిస్తాం. ధరణి వెబ్‌సైట్లో చూసి బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలి. 


ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరు నెలల్లో భూరికార్డుల ప్రక్షాళన

రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.6వేలు అదనం. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు పక్షపాతిగా ఉంటాం. ప్రతిపక్షాల నుంచి ఆశించిన సలహాలు రాలేదు. నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలనే మరోసారి చెప్పారు. రైతులకు ఇంకొకరి అజమాయిషీ ఉండనీయం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయి. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం మాకు లేదు. అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.ఈ భూ ప్రపంచం మీద ఏదైనా అత్యంత ధనిక దేశం ఉందంటే అది అమెరికా. అమెరికా అత్యంత ధనిక దేశమే కాదు. అత్యంత అప్పులున్న దేశం కూడా అని సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి అమెరికా తెలివి లేక అప్పులు చేసిందాఅని సీఎం ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల దిశగా పయనిస్తుందన్న సభ్యుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటలేదన్నారు. చైనా జీఎస్‌డీపీ మన కంటే తక్కువ. చైనా మన కంటే పెద్ద దేశం అయినా.. ప్రతికూలతలు చాలా ఉన్నయి. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉంది. చైనాలో కరువు వస్తే ఒకేసారి7 లక్షల మంది చనిపోయారు. కాగా పాలకుల విధానాల వల్ల రెండు మూడు దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మనకంటే చిన్న దేశం ఇండోనేషియాలో రూ. 24లక్షల కోట్లు మార్కెట్‌లోకి వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జపాన్ జీఎస్‌డీపీ కంటే300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుందని తెలిపారు. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసంప్రాజెక్టులు కట్టడం కోసమని సీఎం పేర్కొన్నారు.రాష్ర్టానికి చెందిన 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీ పడి కొన్నవి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నాకే అప్పు ఇస్తరు. రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం. మార్పుకు అనుగుణంగా పరిపాలకులు మారాలన్నారు. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి తానే స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. పొరుగు రాష్ర్టాలతో ఒప్పందాలతో నీటి సమస్యలను పరిష్కరించినం. ఎన్ని సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరంసీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలన్నారు.తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా నిధులు పోతున్నాయని..రాష్ర్టానికి రూ.24 వేల కోట్ల దాకా తిరిగి వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతీనెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండానే రైతుబందు కింద రూ.10వేలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు సీఎం వివరించారు. రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని.. వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదును జమ చేయగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సీఎం కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment