Breaking News

18/02/2019

చర్మ కారులకు కార్గో వ్యాన్

విజయవాడ, ఫిబ్రవరి 18, (way2newstv.in)
చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కలిపించే లక్ష్యంతో లిడ్ కాప్ మొబైల్ కార్గో వ్యాన్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. లిడ్‌క్యాప్ మొబైల్ కార్గో వాహనాలకు చంద్రబాబు ప్రారంభించారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన చర్మకారులకు మెరుగైన జీవనోపాధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. 

 
చర్మ కారులకు కార్గో వ్యాన్

ముగ్గురు లబ్ధిదారులు ఒక యూనిట్‌గా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. యూనిట్ ధర రూ. 8.12 లక్షల్లో లబ్ధిదారుల వాటాగా 20 శాతం చెల్లించాలి, మిగిలిన 80 శాతం లిడ్ క్యాప్ నిబంధనలుకు లోబడి రుణాన్ని 9 శాతం వడ్డీతో అందజేస్తారు.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలో 415 మొబైల్ కార్గో వాహనాలు అందజేస్తారు. ముగ్గురు లబ్ధిదారులు 21 సంవత్సరాల వయస్సు పైబడి, 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. వారిలో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తొలిదశలో 100 వాహనాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రోడ్డుపక్కన వృత్తి చేసుకునే వారి సౌలభ్యం కోసం దేశంలోనే తొలి సారిగా ఇటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. ఈ వర్గాల వారిని పైకి తీసుకుని వచ్చేందుకు, సమాజంలో గౌరవాన్ని పెంచేలా వారికి వాహనం, మొబైల్ ఫోన్, వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్ సేవలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, చెన్నైలోని కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ సహకారంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు

No comments:

Post a Comment