Breaking News

28/02/2019

కోస్గిలో ఎమ్మెల్యే పట్నం పర్యటన

కొడంగల్, ఫిబ్రవరి 28 (way2newstv.in)
 వికారాబాద్ జిల్లా  కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురువారం పర్యటించారు.  నూతన బస్సు డిపో నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే, పనులు త్వరితగతిన జరపాలని అధికారులు సూచించారు. 


కోస్గిలో ఎమ్మెల్యే పట్నం పర్యటన

అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు  గైర్హాజర్ అయిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. కళ్యాణాలక్ష్మి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,రాజేష్,బలరాజ్,శాసం రామకృష్ణ, ఓం ప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment