Breaking News

25/02/2019

40 కోట్లతో హుస్సేన్‌సాగర్ కు క్లీన్ వాటర్

హైద్రాబాద్, ఫిబ్రవరి 25, (way2newstv.in)
హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి శుద్ధ్ది చేసిన నీరు చేరేలా చర్యలకు శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండిఎ. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు మరమ్మతులు చేయడం, ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్లను మరింత సామర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వీటి కోసం అంచనా వ్యయం రూ. 40 కోట్లు వెచ్చించి టెండర్లను పిలిచింది. మొత్తం 3 ఎస్‌టిపిలు, 11 ఐఅండ్ డిలకు నిర్వహణ, కార్యకలాపాలు, మరమ్మతులు అనే పద్ధతిన టెండర్లకు అథారిటీ ఆహ్వానం పలికింది. హుస్సేన్‌సాగర్ జలాల స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ మురుగునీరు నాలాల ద్వారా సాగర్‌లోకి రాకుండా ఆ నీటిని శుద్ధి చేసేందుకు అథారిటీ ప్రత్యేకంగా రంగధాముని, బల్కాపూర్, పికెట్ నాలాల వద్ద 3 ఎస్‌టిపిలను ఏర్పాటు చేసింది. నాలాల్లో వచ్చే మురుగునీరు, రసాయన కలుషితపు నీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరకుండా ఉండేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఐఅండ్‌డిలు 11 ప్రాంతాల్లో నిర్మించింది. బల్కాపూర్ నాలా వద్ద 20 ఎంఎల్‌డిలు, పికెట్ నాలా వద్ద 30 ఎంఎల్‌డిలు, రంగధాముని నాలా చెంత 5 ఎంఎల్‌డిల సామర్థమున్న ఎస్‌టిపిలను అథారిటీ ఏర్పాటుచేసింది. 


40 కోట్లతో హుస్సేన్‌సాగర్ కు క్లీన్ వాటర్

ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి నిత్యం 55 మిలియన్ లీటర్ల నీరు నాలాల ద్వారా చేరుతుందని అథారిటీ అంచనా వేసింది. ఈ నీటిని శుద్ధ్ది చేసి నాలాల ద్వారా సాగర్‌కు చేరేలా ఈపాటికే చర్యలు చేపట్టింది. అయితే, గతంలో ఎస్‌టిపిల నిర్వహణ బాధ్యతలను జలమండలికి ప్రభుత్వం అప్పగించింది. అయితే, జలమండలి ఆశించిన మేర నిర్వహణ చేపట్టకపోవడంతో హుస్సేన్‌సాగర్‌లోకి కాలుష్య జలాలు చేరడం, దుర్వాసనలు వెలువడటం వంటివి వెల్లువెత్తడంతో ప్రభుత్వం తిరిగి ఎస్‌టిపిలను హెచ్‌ఎండిఎకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌టిపిలు గత కొంతకాలంగా నిర్వహణ లేకపోవడంతో వాటి పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. దీనిని గుర్తించిన అథారిటీ ఎస్‌టిపిలతో పాటు ఐ అండ్ డిలను 3 సం.ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ పరంచేయాలని యోచిస్తున్నది.అయితే, వీటి ద్వారా నిత్యం 55 ఎంఎల్‌డిల మురుగునీరు శుద్ది చేయబడి నాలాల ద్వారా సాగర్‌లోకి చేరవేస్తున్నది.ఫతేనగర్, పికప్‌పీయర్, దివ్యశక్తి అపార్టుమెంట్, ప్రకాశ్‌నగర్, యశోద ఆసుపత్రి, నెక్లెస్‌రోడ్‌లోని బ్రిడ్జి1, బ్రిడ్జీ 2, కూకట్‌పల్లి నాలా చెంతన 1,2 ప్రాంతాల్లో ఐ అండ్ డిలను ఏర్పాటు చేసింది. ఈ ఐ అండ్ డిల ద్వారా మురుగు నీరు నేరుగా ఎస్‌టిపిలను చేర్చేలా చేస్తుండగా కూకట్‌పల్లి నాలాకు నిర్మించిన ఐ అండ్ డిలు మాత్రం ఆ నాలా నుంచి వచ్చే కాలుష్య జలాలను పూర్తిగా హుస్సేన్‌సాగర్‌లోకి చేరకుండా నీటిని పూర్తిగా మ్యారోట్ హోటల్ వైపు మళ్ళిస్తున్నది. అయితే, బల్కాపూర్‌నాలా నుంచి వచ్చే మురుగునీటిలో 5 ఎంఎల్‌డిల శుద్ధి చేసిన నీటిని ఉద్యానవనాల్లో మొక్కలను పెంచేందుకు వినియోగిస్తున్నారు. మిగతా 50 ఎంఎల్‌డిల నీరు మాత్రం శుద్ధి చేసి సాగర్‌లోకి చేర్చుతున్నారు.3 ఎస్‌టిపిలు 55 ఎంఎల్‌డిల సామర్థం, 11 ఐ అండ్ డిల నిర్వహణా బాధ్యతలను చేపట్టేందుకు అథారిటీ టెండర్లను పిలిచింది. మూడేళ్ళు వీటి నిర్వహణా, కా ర్యకలాపాలు, మరమ్మతులు చేపట్టేందుకు అథారిటీ రూ. 40 కోట్లు చెల్లించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నది. ఇవి పనిచేయడం ఆగిపోతే హుస్సేన్‌సాగర్ పూ ర్తిగా మురుగునీటితో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, హెచ్‌ఎండిఎ వద్ద కూడా ఇంజనీరింగ్ అధికారుల కొరత విపరీతంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వీటిని నిర్వహించడం, కార్యకలాపాలు చూడటం, మరమ్మతులు చేపట్టడం చేయాడానికి టెండర్లను పిలిచింది. త్వరలోనే సంస్థ ఖరారుకానున్నది. దీంతో సాగర్‌లోని నీరు స్వచ్ఛగా కనిపించడం ఖాయమనేది అధికారుల విశ్వాసం.

No comments:

Post a Comment