పాల్గొననున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
విజయవాడ ఫిబ్రవరి 14 (way2newstv.in)
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యాయి.
19 నుంచి ‘ప్రత్యేకహోదా భరోసా యాత్ర’
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 నుంచి ‘ప్రత్యేకహోదా భరోసా యాత్ర’ను నిర్వహిస్తామని తెలిపారు.ఈ భరోసా యాత్ర అనంతపురంలోని మడకశిర నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ సాగుతుందని వెల్లడించారు. 25 లోక్ సభ స్థానాలు, 75 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ భరోసా యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని తులసి రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment