Breaking News

08/02/2019

10 శాతం రిజర్వేజన్ల ఫై స్పష్టత ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన సుప్రీం

న్యూఢిల్లీ ఫిబ్రవరి 8 (way2newstv.in)
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేజన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రం స్పందనను కోరింది. ఈ రిజర్వేషన్ల అమలుపై ఎటువంటి స్టే విధించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుపై ‘జన్‌హిత్ అభియాన్‌’, ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ అనే స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్లపై గతంలోనే సుప్రీం.. కేంద్రం స్పందన కోరింది. తాజాగా పూన్‌వాల్లా అనే వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వాటితో పాటు జత చేసింది. 



10 శాతం రిజర్వేజన్ల ఫై స్పష్టత ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన సుప్రీం 

‘‘ఆర్థికంగా బలహీన వర్గాల సాధికారత కోసం తీసుకువచ్చిన ఈ రిజర్వేషన్‌ బిల్లును కొట్టివేయాలి. ఆర్థిక వెనబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఉల్లఘించకుండా చూడాలి’’ అంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఆర్థిక స్థాయి ఒక్కటే వెనకబాటు తనంగా భావించి రిజర్వేషన్లు కల్పించడం సరికాదని తాజా పిటిషన్‌ దాఖలైంది.

No comments:

Post a Comment